Nalini letter : ఆయనది పబ్లిక్ స్టంట్… నా అప్లికేషన్లు చెత్తబుట్టలోకి.. రేవంత్ కి ఝలక్ ఇచ్చిన నళిని

సీఎం రేవంత్ రెడ్డి సార్... నన్ను యాది మీద యాది చేసిండు. ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు...

సీఎం రేవంత్ రెడ్డి సార్… నన్ను యాది మీద యాది చేసిండు. ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు… అని మాజీ డీఎస్పీ నళిని కామెంట్ చేశారు. తనను పబ్లిక్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఇచ్చిన రెండు అప్లికేషన్లు చెత్తబుట్టలో పడేశారని డౌట్ వస్తోందని నళిని లెటర్ రాయడం సంచలనంగా మారింది.

తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్న టైమ్ లో అప్పట్లో డీఎస్పీగా పనిచేసిన నళిని పేరు రాష్ట్రమంతటా మార్మోగింది. ప్రత్యేక తెలంగాణ కోసం తన పోలీసు ఉద్యోగానికి రిజైన్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఉద్యమ సమయంలో అంత పేరు తెచ్చుకున్న నళినీని… రాష్ట్ర సాధన తర్వాత అంతా మర్చిపోయారు. బీఆర్ఎస్ హయాంలో ఆమె గురించి ఊసు కూడా లేకపోతే… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యమకారులు నళిని గురించి సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ఆమెకు మళ్ళీ డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని కొందరు ప్రముఖులు సీఎం రేవంత్ కి సిఫార్స్ చేశారు. డీఎస్పీ జాబ్ లేదా దానికి సమానమైన కొలువు ఇవ్వడానికి సీఎం ఒకే చెప్పినా… నళిని మాత్రం రిజెక్ట్ చేశారు. తనకు ఫిట్నెస్ లేదనీ… ఇప్పడు అధ్యాత్మిక జీవితం గడుపుతున్నానని చెప్పారు. అదే టైమ్ లో వేద విద్యా కేంద్రం ఏర్పాటుకు సహకారంతో పాటు… తన సర్వీస్ అంశానికి సంబంధించి రెండు లెటర్లను రేవంత్ కి ఇచ్చారు నళిని.

నెలలోపు ఎంక్వైరీ చేయిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి… 7 నెలలైనా పట్టించుకోలేదు. దాంతో నా దరఖాస్తులు బల్ల మీదే ఉన్నాయా… లేక చెత్త బుట్టలో పడేశారా అంటూ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని నిలదీశారు నళిని. సెక్రటేరియట్ చుట్టూ తిరిగే ఓపిక లేదు… ఆ రోజే రేవంత్ కి చెప్పానంటూ లెటర్ రాశారు. ఇంట్లో చల్లన్నం లేకపోతే… పైకి వెళ్ళవయ్యా అని అడుక్కునేవాళ్ళకి చెబుతాం… కనీసం అలాంటి మర్యాద అయినా తనకు ఇస్తారా అని రేవంత్ రెడ్డిని నళిని నిలదీశారు.