CM REVANTH REDDY: రేవంత్ సమాచారం లీక్.. భద్రతా సిబ్బందిలో మార్పులు

BRS ప్రభుత్వానికి అంటకాగిన వాళ్ళని దూరం పెడుతున్నారు రేవంత్. ఇప్పుడో మరో కీలక శాఖలో అధికారులు, సిబ్బందిని మార్చేశారు రేవంత్. లీకు రాయుళ్ళను తన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదని డిసిషన్‌కు వచ్చారు.

  • Written By:
  • Updated On - January 24, 2024 / 07:11 PM IST

CM REVANTH REDDY: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పరిపాలనలో ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ముందుగా ఇంటెలిజెన్స్, తర్వాత పోలీసులు, ఆ తర్వాత IASలు ఇలా అధికారులందర్నీ మారుస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే ఇది సహజమేలే అనుకోవచ్చు. కానీ వాళ్ళల్లో కూడా ఎవరు ఏ పనిచేస్తారో గుర్తించి పోస్టింగ్స్ ఇప్పిస్తున్నారు. అవినీతి మరక ఉన్నవాళ్ళను.. BRS ప్రభుత్వానికి అంటకాగిన వాళ్ళని దూరం పెడుతున్నారు రేవంత్. ఇప్పుడో మరో కీలక శాఖలో అధికారులు, సిబ్బందిని మార్చేశారు రేవంత్.

BRS MLAS: మనసు మార్చారా? ఆ నలుగురు కాంగ్రెస్‌లో చేరట్లేదా..? వాళ్ళని పంపింది హరీష్ రావేనా..?

లీకు రాయుళ్ళను తన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదని డిసిషన్‌కు వచ్చారు. రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కీలకంగా వ్యవహరించే ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా పూర్తిగా మార్చేస్తున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న భద్రతా, ఇంటెలిజెన్స్ సిబ్బంది మాజీ సీఎం కేసీఆర్ దగ్గరా పనిచేశారు. అయితే ఈమధ్య తరుచుగా సీఎం రేవంత్‌కు సంబంధించి వ్యక్తిగత సమాచారం లీక్ అవుతోంది. దాంతో పాతవాళ్ళందర్నీ తీసేసి.. కొత్త భద్రతా, ఇంటెలిజెన్స్ సిబ్బందిని నియమించుకుంటున్నారు. గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసేన ఏ ఒక్కర్నీ కూడా ప్రస్తుతం కంటిన్యూ చేయకూడదని CMO నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత ఈ సెక్యూరిటీ సిబ్బందిని మార్చే ప్రక్రియ మొదలైంది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడం వల్లే CMO, ఇంటెలిజెన్స్ అధికారులపై రేవంత్ సీరియస్ అయినట్టు తెలిసింది.

ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు రేవంత్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. అందుకే ఇంటెలిజెన్స్, భద్రతా అధికారులను మార్చాలని రేవంత్ నిర్ణయించారు. ముందుగా పోలీస్ సెక్యూరిటీని మార్చేశారు. సీఎం దగ్గర పనిచేసే అధికారులు తమ దగ్గర నుంచి ఎలాంటి సమాచారం బయటకు వెళ్ళకుండా ఉండాలి. రేవంత్ పర్యటనలకు వెళితే ఎక్కడికి వెళ్తున్నారు.. ఎప్పుడు, ఎక్కడ ఉంటారు.. ఎప్పుడు తిరిగి వస్తారు లాంటి అంశాలు కూడా బయటి వాళ్ళకి తెలియకూడదు. అలాగే సీఎం రక్షణ బాధ్యతల విషయంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేసీఆర్ దగ్గర 9 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో ఉన్నారు. దాంతో వాళ్ళని మార్చేసి.. కొత్త సిబ్బందిని నియమించాలని CMO నిర్ణయించింది. లీక్ రాయుళ్ళు ఎవరూ తన దగ్గర ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.