Mumbai, Airport, Cocaine : ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్.. థాయ్ మహిళ వద్ద 40 కోట్ల విలువ చేసే కోకైన్ స్వాధీనం

మాహారాష్ట్ర లోని ముంబయి (Mumbai Airport) విమానాశ్రయంలో ఈరోజు భారీగా కొకైన్ అధికారులు పట్టుకున్నారు. థాయ్ లాండ్ కు చెందిన ఓ మహిళా నుంచి భారీగా కోట్ల విలువ చేసే కోకైన్ ను విమానాశ్రయ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ (Directorate of Revenue) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కొకైన్ అక్రమ రవాణా చేసున్నట్లు విషయం తెలుసుకున్న అధికారులు ముంబయి ఎయిర్ పోర్టులో ఉన్న ప్రతి ఒక్కరి లగేజీని సూక్ష్యంగా వేతికారు. అధికారులు తనిఖీలు చేయగా 21 ఏళ్ల థాయిలాండ్ మహిళల బ్యాగ్ లో తెల్లటి పొడి పదార్థాన్ని గుర్తించారు. దాన్ని పరిశీలించగా.. అది కోకైనా గా నిర్థారించారు ఎయిర్ పోర్టు అధికారులు.. కాగా ఈ కొకైన్ (Cocaine ) విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపుగా రూ. 40 కోట్లు ఉంటుందని విమానాశ్రయ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ అధికారులు వివరించారు. ఈ మేరకు థాయ్ మహిళ (Thai Woman) పై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.