రేవంత్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఐటి కంపెనీ…!

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ముగిసిన కొన్ని రోజులకే కోకాపేట లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్ రెడ్డి.

  • Written By:
  • Updated On - August 14, 2024 / 09:20 AM IST

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ముగిసిన కొన్ని రోజులకే కోకాపేట లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికుమార్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా కేవలం 10 రోజుల్లోనే శంకుస్థాపనకు సిద్దమయ్యారు.

హైదరాబాద్ లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు రానున్నట్టు సంస్థ పేర్కొంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై ఈ క్యాంపస్ ఫోకస్ చేయనుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని నేడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు.

ఈ రోజు సాయంత్రమే ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ కూడా హాజరు కానున్నారు. 1994లో చెన్నై కేంద్రంగా కాగ్నిజెంట్ సంస్థను స్థాపించగా… హైదరాబాద్‌లో 2002 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు మొదలుపెట్టింది. మొత్తం ఈ సంస్థకు ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్ లు ఉండగా హైదరాబాద్‌లో దాదాపు 57 వేల మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పని చేస్తున్నారు.