Telugu states : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. రోజురోజుకు పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఇప్పటికే గజగజా వణుకిపోతున్నారు ప్రజలు. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతునే ఉంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచుతో కప్పి ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి.

 

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఇప్పటికే గజగజా వణుకిపోతున్నారు ప్రజలు. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతునే ఉంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచుతో కప్పి ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే గజగజా వణికిపోతున్నారు. చలి పెరగడంతో ముఖ్యమంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కూడా.. జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈసారి ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు చోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కాగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు పడిపోయాయి. సాధారణంగా ఈ టైంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాల్సింది.. కానీ, ప్రస్తుతం 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గిపోయాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగె అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో వాతావరణం చల్లగా ఉంటోంది. రాత్రిపూట కాకుండా పగలు కూడా చలిగాలులు వణికిస్తున్నాయి. గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతవరణం ఏర్పాడే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు మాత్రం చలి విషయంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.