North India.. Heavy snowfall  : ఉత్తర భారత్ లో మొదలైన చలి.. ఈ రాష్ట్రాల్లో భారీ హిమపాతం.. మంచు ప్రదేశాలకు పర్యటకులు క్యూ

ఉత్తర భారత దేశంలో తీవ్రమైన చలి మొదలైంది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లో రికార్డు స్థాయిలో చలి నమోదైవుతుంది. భారత సరిహద్దు రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ లో తేలికపాటి మంచు వర్షం కురుస్తోంది. ఆ రాష్ట్ర పరిసర రాష్ట్రాలకు, కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే గ్రామాలకు చలిగాలులు వీస్తున్నాయి.

ఉత్తర భారత దేశంలో తీవ్రమైన చలి మొదలైంది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లో రికార్డు స్థాయిలో చలి నమోదైవుతుంది. భారత సరిహద్దు రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్ లో తేలికపాటి మంచు వర్షం కురుస్తోంది. ఆ రాష్ట్ర పరిసర రాష్ట్రాలకు, కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే గ్రామాలకు చలిగాలులు వీస్తున్నాయి. ఇక మైదాన ప్రాంతాలు అయిన దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7.4 డిగ్రీలు, గరిష్ట 24.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగానే ఉంది. మరో రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ- ఎన్సీఆర్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు కొనసాగుతుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, దేశ రాజధానిలో AQI స్థాయి ఇప్పటికీ వెరీ పూర్ కేటగిరీలోనే ఉంది.

ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన చోటా చార్ ధామ్ యాత్రలు నిలిపివేయబడ్డాయి. కేదార్ నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రి, పంచ కేధార్ వంటి యాత్రలు అన్ని కూడా మరో 6 నెలల వరకు తెరవబడవు.. కారణం ఆ ఆలయలు ఉన్న ప్రాంతాల్లో మంచు వర్షం కురవడం మొదలైంది. ఏకంగా ఆ ప్రాంతాల్లో -20 నుంచి -40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి.

ఈ రెండు నెలల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు ప్రదేశాలకు చేసేందుకు పర్యటనకు మొగ్గు చూపుతున్నారు. మంచు ప్రదేశాలకు పర్యటకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మూడు నెలల్లో మనాలి, డార్జిలింగ్, భారత దేశం మొదటి గ్రామం అయిన మన విలేజ్ , కాశ్మీర్, లడఖ్, సిమ్లా, డల్హౌసి, ఔలి, గుల్మార్గ్, హిల్ స్టేషన్ లో భారీ మంచు వర్షం కురుస్తోంది. దీంతో పర్యాటకులు శ్వేత వర్ణం ప్రపంచాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు..