Srisailam Plastic Ban : శ్రీశైలంలో అమల్లోకి పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం…

ఏపీలోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల్ల అడవుల్లో ఉన్న ద్వాదస జోతిర్లింగాల్లో ఒకటి అయిన శ్రీశైల మల్లిఖార్జున క్షేంత్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఇక పై శ్రీశైలంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నిబందన మే 1 నుంచి అమలు అవుతు వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది రెండు ఆలయాలు.. ఒక తెలంగాణ బార్డర్ లో ఉన్న శ్రీశైలం క్షేత్రం అయితే.. మరొకటి తమిళనాడు బార్డర్ లో ఉన్న తిరుపతి.. ఈ రెండు ఆలయాల గురించి మనకు పెద్దగా పరిచయం అక్కలేదు.. అందులోను ఈ రెండు ఆలయాలకు వెళ్లని తెలుగు వాళ్లు ఉండరు.

ఇక విషయంలోకి వెళితే.. ఏపీలోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల్ల అడవుల్లో ఉన్న ద్వాదస జోతిర్లింగాల్లో ఒకటి అయిన శ్రీశైల మల్లిఖార్జున క్షేంత్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఇక పై శ్రీశైలంలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నిబందన మే 1 నుంచి అమలు అవుతు వస్తుంది. నల్లమల్ల అడవుల్లో పర్యాటకులు, భక్తులు సందర్శించినప్పుడు ఆలయ ప్రాంగంణంలో.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో.. శ్రీశైలం డ్యాం వద్ద పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వాడటం వల్ల పరియవరణంకు నష్టం వాటిలుతుంది అని శ్రీశైలం ఆలయ ఈవో ఈ వెల్లడించారు.

పర్యవరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ఏ విధంగా అయితే ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించారో.. అదేవిధంగా శ్రీశైలంలో కూడా ప్లాస్టిక్ వాడకం పై పూర్తి నిషేదం విధించారు. దీంతో దేవస్థానం బోర్డు ఆదేశంతో పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగారు. చెక్‌పోస్టు పరిసరాల్లో పడి ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లతోపాటు చెత్తను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నారు.

శ్రీశైలం కు వచ్చే ఘాట్ రోడ్డులో పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. శ్రీశైలం దైవ దర్శనానికి వచ్చే భక్తుల ప్రతి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిళ్లను ఎవరూ క్షేత్ర పరిధిలోకి తీసుకురాకుండా కట్టుదిట్టంగా ప్లాక్టిక్ బ్యాన్ ను అమలు చేస్తున్నారు. ఇక మరోవైపు క్షేత్ర ప్రాంగణంలో ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే స్థానిక వ్యాపారులు, హోటల్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ జంతువుల సంరక్షణ కోసం ప్లాస్టిక్‌ మంచినీటి సీసాలకు బదులుగా గాజు సీసాలనే విక్రయించాలని స్పష్టం చేశారు. అలాగే మట్టి, స్టీల్‌, రాగితో తయారైన బాటిళ్లను కూడా విక్రయించవచ్చని సూచించారు. భక్తులకు ప్లాస్టిక్ పై అవగాహన కల్పించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ నిషేధం పై ప్రజలు, భక్తులు, యాత్రికులు, పర్యటకు, స్థానికులు, వ్యాపారులు నిర్వాహకులు సహకరించాలని శ్రీశైలం ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు.

SSM