RYTHU BANDHU: రైతులకు శుభవార్త.. రైతుబంధుపై కాంగ్రెస్‌ కీలక ప్రకటన

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బు అకౌంట్లలో పడింది. ఇంకొందరికి పడలేదు. దీంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఐతే రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తుమ్మల సూచించారు.

  • Written By:
  • Updated On - January 10, 2024 / 06:14 PM IST

RYTHU BANDHU: తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు రైతు బంధు చుట్టే తిరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి నెలరోజులు దాటినా.. వరి నాట్ల సీజన్‌ వచ్చేసినా.. ఇంకా రైతు బంధు ఎందుకు వేయడంలేదు అంటూ కాంగ్రెస్‌పై బీఆర్ఎస్‌ ఘాటుగా విమర్శలు గుప్పిస్తోంది. దీంతో రైతు బంధు విషయంలో కాంగ్రెస్‌కు, కారు పార్టీకి మధ్య భారీ యుద్ధమే జరుగుతోంది. ఐతే ఇలాంటి పరిణామాల మధ్య రైతుబంధుపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపికబురు చెప్పారు.

PRASHANT KISHOR: టీడీపీలో పీకే బాధ్యతలు అవే.. లోకేశ్‌ ప్లాన్‌ మాములుగా లేదుగా..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొంతమందికి రైతుబంధు సాయం డబ్బు అకౌంట్లలో పడింది. ఇంకొందరికి పడలేదు. దీంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఐతే రైతుబంధుపై ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తుమ్మల సూచించారు. సంక్రాంతి పండుగ అయిపోగానే అర్హులందరికీ రైతుబంధు అందుతుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో కబ్జాల ప్రభుత్వం పోవాలని జనాలు కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్‌ను ఆదరించారని అన్నారు. అర్హులకు మాత్రమే పథకాలు అందించాల్సి ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ఎన్నో పథకాలు మాటల వరకే పరిమితమయ్యాయని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జనాల్లోకి వెళ్తున్నాయని అన్నారు.

సీఎం రేవంత్ జనాల కోసం బాగా కష్టపడుతున్నారని.. ఆయన శ్రమ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురం మంత్రులం ఉన్నామని.. పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇదంతా ఎలా ఉన్నా.. రైతుబంధుపై హామీ రావడంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తోంది.