Ajay Rai: దేశ ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయబోతున్న నియోజకవర్గం వారణాసి. వరుసగా రెండుసార్లు మోదీ ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారు. రెండుసార్లు ప్రధాని అయ్యారు. అలాంటి మోదీని ఎదుర్కోవడం అంత సులభం కాదు. కానీ, అజయ్ రాయ్ మాత్రం మోదీతో పోటీకి సై అంటున్నాడు. ఆయన కాంగ్రెస్ తరఫున వారణాసి నుంచి పోటీ చేయబోతున్నాడు. మోదీపై అజయ్ పోటీ చేయడం ఇదే మొదటిసారి కాదు. మూడోసారి.
Kangana Ranaut: లోక్‌సభ ఎన్నికల్లో కంగనా.. ఆ పార్టీ నుంచే పోటీ..
గతంలో రెండుసార్లు వరుసగా మోదీపై పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మరోసారి మోదీపై పోటీకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అజయ్ రాయ్ అయితేనే, మోదీని సమర్ధంగా ఎదుర్కోగలరని భావిస్తోంది. దీనికో కారణం ఉంది. మోదీ.. భూమిహార్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ ఈ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వారణాసిలో అజయ్ పోటీ చేయడం వల్ల ఈ ప్రాంతంతోపాటు తూర్పు యూపీలో ఓట్లను కూడా అతడు ప్రభావితం చేయగలరు. పైగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ప్రాంతం నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అందువల్ల కాంగ్రెస్.. అజయ్ రాయ్‌ను మోదీపై పోటీకి దించబోతుంది. ఈసారి ఇండియా కూటమి కింద యూపీలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కలిసి పోటీ చేయబోతున్నాయి.
ఎస్పీ మద్దతు కూడా కలిసొస్తుందన కాంగ్రెస్ భావిస్తోంది. అజయ్ రాయ్ గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇందులో ఒకసారి ఇండిపెండెంట్‌గా కూడా గెలిచారు. కానీ, 2014, 2019 ఎన్నికల్లో మోదీ చేతిలో ఓడిపోయారు. మరి ఈసారైనా అజయ్ రాయ్ గెలుస్తారా..? మోదీపై విజయం సాధిస్తారా..? అనేది చూడాలి.