VICTORY VENKATESH: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డికి ఫైనల్‌గా టికెట్ దక్కింది. ఈ టికెట్ కోసం చాలా మంది పోటీలో ఉన్నా.. ఎంతో మంది పేర్లు తెరమీదకు వచ్చినా.. చివరికి రఘురాం రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే ఎప్పుడూ ఎక్కడా పెద్దగా వినిపించని కనిపించని రఘురాంరెడ్డికి టికెట్ రావడంతో అందరి ఫోకస్ ఇప్పుడు ఆయన మీదే ఉంది.
TDP VS YSRCP: తిరుపతిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
రాజకీయంగా రఘురాం రెడ్డి సైలెంట్‌గానే ఉన్నా.. వాళ్ల కుటుంబానికి మాత్రం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. తండ్రి సురేందర్ రెడ్డి స్ఫూర్తితో ఒక వైపు వ్యాపారాలు చేస్తూనే.. 1985 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు రఘురాం రెడ్డి. కేవలం రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా రఘురాం రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి. సినీ హీరో వెంకటేష్‌కు రఘురాం రెడ్డికి స్వయానా వియ్యంకుడు. రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డికి వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితను ఇచ్చి పెళ్లి చేశారు.
కేవలం రఘురాం రెడ్డి మాత్రమే కాదు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ కూడా వెంకటేష్‌కు బంధువే అవుతారు. ఎందుకంటే రఘురాం రెడ్డి రెండో కొడుకు అర్జున్ రెడ్డికి పొంగులేటి కూతురు సప్నిరెడ్డిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ రకంగా చూస్తే పొంగులేటి, వెంకటేష్ ఇద్దరూ అన్నాదమ్ములు అవుతారు. రాజకీయంగా ఎప్పుడూ ఎక్కడా పెద్దగా ఇన్వాల్వ్ అవ్వని రఘురాం రెడ్డి ఏకంగా ఖమ్మం ఎంపీ టికెట్ సాధించడం. విక్టరీ వెంకటేష్‌కు వియ్యంకుడు అవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది.