Jaggareddy: సీఎం రేవంత్ రెడ్డి పాలన చూసి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని, తాము తొడగొడితే కేటీఆర్ గుండె ఝళ్లుమంటుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్‌పై ఫైరయ్యారు. “తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించిన కోదండరామ్‌ను హరీష్, కేటీఆర్ విమర్శించడం సరికాదు. తొమ్మిదేళ్లలో కేసీఆర్.. కోదండరామ్‌కు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు.
TDP-JANASENA: లోకేష్ ఓవర్ యాక్షన్.. లూజ్ టాక్.. టీడీపీ-జనసేన బంధానికి ఎసరు..?
తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ ఎంతో సహకరించింది. కోదండరామ్ డైరెక్షన్‌లో అందరూ పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ పెద్దన్నలాగా బీష్ముడి పాత్ర పోషించారు. కేసీఆర్, హరీశ్ రావు ఎన్నోసార్లు కోదండరామ్ ఇంటికి వెళ్లారు. ఉద్యమం కొనసాగుతున్న సమయంలో కోదండరాంను మీరు దేవుడిలా కొలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ ఇస్తే.. కేటీఆర్ ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు. కోదండరామ్‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా సముచిత స్థానం కల్పించింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పి ప్రజల ముందు నిలబెడతామన్నాడు కేటీఆర్. కాంగ్రెస్ నాయకుల బట్టలు విప్పే దమ్ము కేటీఆర్‌కు ఉందా? మేం తొడగొడితే కేటీఆర్ గుండె ఝళ్లుమంటుంది. కేటీఆర్.. బట్టలు విప్పి కొట్టేంత తిస్మార్ఖాన్ అనుకుంటున్నవా. మజాక్ చేస్తున్నావా.? ఏమనుకుంటున్నావు. నీ కెపాసిటీ ఎంత..? మాకు రావా మాటలు. గౌరవం పోగొట్టుకోవద్దు. కేటీఆర్.. గవర్నర్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. కోదండరాంని మేము ఎమ్మెల్సీ చేయలేకపోయాము. మీరైనా చేశారు అని అభినందించాలిర్.
బయటకు చెప్పలేకపోయినా.. మనసులో అయినా చెప్పుకోండి. అయ్యా.. కొడుకులు ఇద్దరూ.. మీకే నోరు ఉన్నది అనుకుంటున్నారా..? కేటీఆర్ నువ్వు చవట. హరీష్ నువ్వో పెద్ద చవట అంటే మీకు బాధ అనిపించదా. తొమ్మిదిన్నరేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెల రోజుల్లో చేసింది. నేను ఓడిపోయిన తర్వాత అందరూ నామీద సానుభూతి చూపిస్తున్నారు. మాకు చెప్తే పంపే వాళ్ళం డబ్బులు అని అంటున్నారు. ఓడిపోయిన తర్వాత సానుభూతి ఎందుకు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.