RAHUL SEAT FINAL : రాహుల్ వదులుకునే సీటేది ? రాయ్ బరేలీలో ప్రియాంకకు ఛాన్స్

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)...తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించారు.

 

 

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)…తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ విజయం సాధించారు. యూపీలోని రాయ్ బరేలీ (Rae Bareilly) తో పాటు కేరళలోని వయనాడ్ లో గెలిచారు. రెండు చోట్లా కూడా రాహుల్ కి 3 లక్షలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెండింటిలో ఏ సీటు వదులుకుంటారన్నదానిపై చర్చ నడుస్తోంది. తన కుటుంబానికి కంచుకోటగా నిలిచిన రాయ్ బరేలిని ఉంచుకుంటారా లేదంటే రెండు సార్లుగా గెలిపిస్తున్న వాయనాడ్ లో రాహుల్ కంటిన్యూ అవుతారా ? వయనాడ్ (Wayanad) లోక్ సభ స్థానంలో మైనార్టీ ఓటర్లు ఎక్కువ.

ఇక్కడున్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు ఎస్టీ రిజర్వుడ్, ఒకటి ఎస్టీ రిజర్వుడ్. అంతేకాదు ఈ నియోజకవర్గంలో ముస్లింలు, క్రైస్తవ మైనార్టీల ఓట్లు కూడా ఎక్కువే. వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. వాయనాడ్ లో రాహుల్ పై పోటీగా బీజేపీ (BJP) కేరళ అధ్యక్షుడు సురేంద్రన్, సీపీఐ అన్నీ రాజాను దింపాయి. ఇద్దరూ బలమైన నేతలే అయినా జనం రాహుల్ కే పట్టం కట్టారు. గతంలో అమేథీలో ఓడించినా… అప్పుడూ… ఇప్పుడూ.. రాహుల్ ని గెలిపించింది వాయనాడ్ ప్రజలే. అందుకే ఆయన ఈ సీటు వదులుకునే అవకాశం లేదంటున్నారు. పైగా రాహుల్ ఇక్కడ ఉండటం వల్ల కేరళలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి బూస్టింగ్ గా ఉంటుందని భావిస్తున్నారు.

రాయ్ బరేలీ కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోట. 1951 నుంచి ఇక్కడ 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. సోనియా గాంధీ ఈమధ్యే రాజ్యసభకు ఎంపిక అవడంతో ఆ స్థానంలో రాహుల్ పోటీ చేశారు. ఇప్పుడు రాహుల్ ఈ సీటు ఖాళీ చేస్తే ప్రియాంకను నిలబెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అసలు ఆ ఉద్దేశ్యంతోనే ప్రియాంకను మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దించలేదు కాంగ్రెస్. ఉప ఎన్నిక ద్వారా ప్రియాంకను రాయ్ బరేలీలో పోటీ చేయించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. అందుకే రాహుల్ వాయనాడ్ లో కంటిన్యూ అవుతూ…రాయ్ బరేలీ సీటును తన సోదరికి త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి.