నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ ధర్న చేయనుంది. ఇటివలే పార్లమెంటులో భద్రత లోపం వల్ల చట్ట సభల్లోకి ఆగంతకులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేశారని.. పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ‘ఇండియా’ కూటమి నేతృత్వంలో నిరసనలు చేసేందుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా HYD ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి నేడు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సా.4 గంటల వరకు జరిగే ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు.
విషయంలోకి వెళితే.. నూతన పార్లమెంటులో సభలో చర్చలు జరుపుతుండగా.. గ్యాలరీ నుంచి టీయర్ గ్యాస్ తో ఆగంతకులు రావడానికి కారణమైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఘటనపై ప్రశ్నించిన 150 మందికిపైగా ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అన్నారు. కాగా ఏఐసీసీ అదిష్టానం పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నేడు ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనున్నారు.