PATNAM SUNITHA: ఈటల గెలిస్తే.. జనానికి కనిపించడు.. పిలిస్తే పలుకుతానంటున్న పట్నం సునీత

కమలాపూర్, హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల అక్కడేం చేశారు.. గెలిచిన తర్వాత సమస్య చెప్పుకోడానికి వచ్చే జనాన్ని కూడా కలవడు.. అలాంటోడికి మల్కాజ్‌గిరిలో ఎందుకు ఓట్లేయ్యాలని అడుగుతున్నారు సునీత.

  • Written By:
  • Updated On - April 27, 2024 / 03:41 PM IST

PATNAM SUNITHA: మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి ప్రచారం ధూమ్‌ధామ్‌గా నడుస్తోంది. ఇంటింటికీ వెళ్ళి జనాన్ని కలుస్తూ.. స్థానిక సమస్యలన్నీ తీరస్తానని చెబుతోంది. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ సర్కారేనని, కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మల్కాజ్‌గిరి జనం ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇస్తున్నారు పట్నం సునీత. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో ఢీ అంటే ఢీ అంటున్నారు.

2024 YCP Manifesto Release : 2024 వైసీపీ మేనిఫెస్టో విడుదల.. మేనిఫెస్టోను రిలీజ్ చేసిన సీఎం జగన్

కమలాపూర్, హుజూరాబాద్ నుంచి గెలిచిన ఈటల అక్కడేం చేశారు.. గెలిచిన తర్వాత సమస్య చెప్పుకోడానికి వచ్చే జనాన్ని కూడా కలవడు.. అలాంటోడికి మల్కాజ్‌గిరిలో ఎందుకు ఓట్లేయ్యాలని అడుగుతున్నారు సునీత. నేను పిలిస్తే వస్తా.. మీ బాధలు తీరుస్తా అని జనానికి హామీ ఇస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత. ప్రజలకు నేను ఎంత అండగా ఉన్నానో వికారాబాద్‌లో అడగండి. హుజూరాబాద్‌లో ఈటల గురించి అడిగితే బండారం బయటపడుతుంది అంటూ సునీత సవాల్ చేశారు. హుజూరాబాద్‌లో ఓడిన తర్వాత ఈటల రాజేందర్ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి పోలేదు. ఆయన్ని కలవడానికి శామీర్ పేటలో ఇంటికెళితే ఒక్క నిమిషం కూడా టైమ్ ఇవ్వలేదని ఆరోపించారు. మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మామూలుగా నడవడం లేదు. పట్నం సునీతా మహేందర్ రెడ్డికి జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక్కడ బీజేపీ నుంచి నిలబడ్డ ఈటల రాజేందర్‌కు అసలు ఎందుకు ఓట్లెయ్యాలని సునీత నిలదీస్తున్నారు.

YS JAGAN: ఆనవాళ్లే లేవుగా! బ్యాండేజీ తీసిన జగన్‌.. కనిపించని గాయం గుర్తులు..

హుజూరాబాద్, గజ్వేల్‌లో చెల్లని రూపాయి మల్కాజ్ గిరిలో చెల్లుతుందా..? రేవంత్ కొడంగల్‌లో ఓడినా మల్కాజ్ గిరిలో ఎంపీగా గెలిచారు. ఈటలకీ, రేవంత్ రెడ్డికీ అసలు పోలిక ఏంటని అడుగుతున్నారు సునీత. గెల్వక ముందు ఓ మాట.. గెలిచిన తర్వాత ఇంకో మాట చెప్పడం ఈటలకు అలవాటైందని పట్నం సునీత ఫైర్ అవుతున్నారు. 2004లో కమలాపూర్ నుంచి, ఆ తర్వాత హుజూరాబాద్‌లో గెలిచి అక్కడ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తున్నారు సునీత. కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా ఉందనుకొని.. పొరపాటున ఉపఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు మళ్ళీ ఈటలను గెలిపించారు. ఆయన కేసీఆర్‌తో కొట్లాడిందే లేదు. నిజంగా కొట్లాడితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ ప్రజలు ఎందుకు ఓడించారని కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఉపఎన్నికల్లో 20 హామీలతో మేనిఫెస్టో ఇచ్చిన ఈటల రాజేందర్.. అందులో ఒక్కటీ ఎందుకు నెరవేర్చలేదు. కేంద్రంతో కొట్లాడి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెస్తా అన్నడు. అవి ఎటు పోయినయ్ అని నిలదీశారు సునీతా మహేందర్ రెడ్డి. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్ ఉన్నప్పుడే నిధుల గోల్ మాల్ బయటకొచ్చింది. ఏసీబీ సోదాలు కూడా చేసింది.

మెదక్ జిల్లాలో జమున హేచరీస్ పై అప్పటి మెదక్ కలెక్టర్ విచారణ చేసి.. 70 ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్ కాజేసినట్టు తేల్చడం నిజం కాదా అని సునీత ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ముదిరాజ్‌లకు నాయకుడిని అని చెప్పుకొని.. బీజేపీలో పదవులు పొందావ్. ఇప్పుడు వాళ్ళని ఎందుకు దగ్గరకు రానీయడం లేదని ఈటలను ప్రశ్నించారు పట్నం సునీత. ముదిరాజ్ సోదరులు ఈ సంగతి అర్థం చేసుకోవాలని అంటున్నారు. జనాన్ని కలవడానికి ఇష్టపడని ఈటల రాజేందర్ కావాలా.. మీ అక్కగా.. చెల్లిగా సేవ చేసే.. నేను కావాలో మల్కాజ్ గిరి ప్రజలు ఆలోచించుకోవాలని అంటున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి.