Congress Manifesto “Abhyahastam” : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. “అభయహస్తం” అని పేరుతో 42 పేజీల మేనిఫెస్టో విడుదల

ఈ సారి తెలంగాణ ను ఇచ్చిన పార్టీగా ఎలగైనా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆరు గ్యారేంటీలు లతో ప్రచారం చేసినప్పటికి నేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి మేనిఫెస్టో ఆ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకు "అభయహస్తం" అని పేరు పెట్టారు కాంగ్రెస్ పార్టీ.

తెలంగాణలో ఎన్నికలు మరింత రసవంతంగా అయ్యాయి. ఎట్టకేలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సారి తెలంగాణ ను ఇచ్చిన పార్టీగా ఎలగైనా తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆరు గ్యారేంటీలు లతో ప్రచారం చేసినప్పటికి నేడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి మేనిఫెస్టో ఆ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ భవన్ లో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకు “అభయహస్తం” అని పేరు పెట్టారు కాంగ్రెస్ పార్టీ. మొత్తం 42 పేజీలతో.. 37 ప్రధానాంశాలతో.. అనుబంధ మేనిఫెస్టో పేరిట జాబ్‌క్యాలెండర్‌ మరో 13 అంశాల్ని చేర్చింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి‌‌,శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మేనిఫెస్టోలోని హామీలు..

  • తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ₹25వేల పింఛను
  • తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
  • ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం
  • వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్
  • రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల పంట రుణమాఫీ
  • రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణాలు
  • రైతు కూలీలకు రూ. 12 వేలు
  • అన్ని పంటలకు మద్దతు ధర
  • చక్కెర కర్మాగారాలు, పసుపు బోర్డు ఏర్పాటు
  • భూమిలేని రైతులకు సైతం రైతు బీమా
  • ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్‌
  • 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ
  • నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం
  • నిరుద్యోగ యువతకు నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి
  • దివ్యాంగుల నెలవారీ పెన్షన్ రూ. 6 వేలకు పెంపు
  • అంగన్వాడీ టీచర్లకు నెలకు రూ. 18 వేల వేతనం
  • ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు
  • కొత్తగా మూడు ఎస్టీ, మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు
  • మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం రూ. 10 వేలకు పెంపు
  • 50 ఏళ్లు పైబడిన జానపద కళాకారులకు రూ. 3 వేల పెన్షన్
  • మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 5 లక్షలు
  • రేషన్ డీలర్లకు రూ. 5 వేల గౌరవ వేతనం
  • మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం
  • ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజూ ‘ప్రజాదర్భార్’ ఏర్పాటు
  • వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రూ.2 లక్షల ఉద్యోగాల భర్తీ
  • ఆడపిల్లల పెళ్లికి రూ.లక్షతో పాటు 10 గ్రాముల బంగారం.
  • కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద రూ.5 లక్షలు