CONGRESS MLC’S: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తైంది. రకరకాల సమీకరణాల తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ పేర్లు ఖరారయ్యాయ్. గవర్నర్ కోటాకు సంబంధించి కోదండరామ్, జావెద్ అలీ ఖాన్ కొడుకు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఫైనల్ చేశారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని.. ఈ నలుగురిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. దీంతో పాటు పార్టీ కోసం పనిచేస్తూ.. పార్టీ గొంతుకగా మారిన వారికి.. ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని.. ఎమ్మెల్సీ ఎంపికతో చెప్పకనే చెప్పింది కాంగ్రెస్. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు.
Chandrababu Naidu: ప్రస్తుతానికి నో రిలీఫ్! తీర్పుపై భిన్నాభిప్రాయాలు.. CJI ముందుకు క్వాష్ పిటిషన్..
అసెంబ్లీ కోఆర్డినేటర్‌గా ఉన్నా.. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బల్మూరి వెంకట్.. హుజూరాబాద్ ఉపఎన్నిక నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరు కూడా పార్టీ కోసం.. ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నారు. అనేక ఉద్యమాలు చేశారు. ఎన్ఎస్‌యూఐ తరఫున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి పోరాటం చేశారు. హైకోర్టు వరకు కూడా వెళ్లారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. జైలుకి కూడా వెళ్లారు. జైల్లో ఉన్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లి బల్మూరి వెంకట్‌ను పరామర్శించారు. ఇక అద్దంకి దయాకర్.. పార్టీ వాయిస్‌ను అనేక వేదికలపై బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ ప్లే చేశారు. ఉద్యమంతో పాటు కష్టకాలంలో పార్టీ కోసం పని చేశారనే ఉద్దేశంతో.. ఈ ఇద్దరిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చాలామంది పేర్లు తెరమీదకు వచ్చాయ్. చాలామంది సీనియర్ల పేర్లు వినిపించాయ్.
ఐతే అద్దంకి దయాకర్ పేరు మొదటి నుంచి ఈ లిస్ట్‌లో వినిపించినా.. బల్మూరు వెంకట్ మాత్రం సడెన్‌గా వచ్చారు. ఈ ఇద్దరికీ పార్టీ పెద్దల నుంచి ఫోన్‌లు కూడా వెళ్లాయ్. నామినేషన్లకు గురువారం చివరి తేదీ కాగా.. ఇందుకు రెడీగా ఉండాలని ఇద్దరు నేతలకు పార్టీ పెద్దలు సూచించారు. ఈ ఇద్దరితో పాటు.. కోదండరామ్, అమీర్ అలీఖాన్ కూడా పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. ఈ నలుగురిలో ఒకరికి మంత్రివర్గంలో అవకాశం దక్కే చాన్స్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ జరగబోతుండడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.