CONGRESS FIRST LIST: వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం సాయంత్రం 36 మందితో తొలి జాబితా ప్రకటించింది. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) ఈ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చోటు దక్కింది. ఆయన ప్రస్తుత సిట్టింగ్ స్థానమైన కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు.
మిగతా అగ్రనేతలకు సంబంధించి శశి థరూర్ తిరువనంతపురం నుంచి, భూపేశ్ బఘెల్ రాజ్‌నంద్‌గావ్ నుంచి, విన్సెంట్ పాలా మేఘాలయ నుంచి, ఆశిష్ సాహా త్రిపుర పశ్చిమ నుంచి పోటీ చేయబోతున్నారు. తెలంగాణ నుంచి కూడా నలుగురు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కార్, మహబూబ్‌నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ కుందూరు, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయబోతున్నారు. మొదటి జాబితాలో కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్ రాష్ట్రాల్లోని కొన్ని స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది.