Ponguleti Srinivas : బీఆర్ఎస్‌ను కబ్జా చేస్తున్న కాంగ్రెస్ ? పొంగులేటితో కేరళకు బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే

తెలుగు రాష్ట్రాల్లో అలా పార్లమెంట్‌ ఎన్నికలు (Parliament Elections) ముగిశాయో లేదో ఇలా ఎమ్మెల్యేలను క్యాంప్‌కు తరలిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas) కేరళకు పయనమయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో అలా పార్లమెంట్‌ ఎన్నికలు (Parliament Elections) ముగిశాయో లేదో ఇలా ఎమ్మెల్యేలను క్యాంప్‌కు తరలిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas) కేరళకు పయనమయ్యారు. కేరళలోని కొచ్చిన్‌కు ఎమ్మెల్యేలను తీసుకువెళ్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అదే ఫ్లైట్‌లో బీఆర్ఎస్‌ (BRS) మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి (Pilot Rohit Reddy) కూడా ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. పొంగులేటి టీంతో రోహిత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు అనే చర్చ మొదలైంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ (BRS) ఓడిపోయినప్పటి నుంచీ ఆ పార్టీ నేతలంతా వరుగా పార్టీ మారుతున్నారు. ఓడిపోయినవాళ్లు గెలిచినవాళ్లు అనే తేడా లేకుండా అంతా పక్క చూపులు చూస్తున్నారు.

ఇదే క్రమంలో రోహిత్‌ కూడా ఇప్పుడు కేసీఆర్‌కు హ్యాండ్‌ ఇవ్వబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. గతంలో కాంగ్రెస్‌ అంటేనే తోకతొక్కిన తాచులా లేచిన రోహిత్ రెడ్డి బీఆర్ఎస్‌ ఓడిపోయిన తరువాత సైలెంట్‌ అయ్యారు. ఎక్కడా పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు సడెన్‌గా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి కేరళ ఫ్లైట్‌లో దర్శనమిచ్చారు. దీంతో త్వరలోనే రోహిత్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. మరోవైపు రోహిత్‌ అనుచరులు మాత్రం ఈ చర్చను కొట్టిపారేస్తున్నారు. పొంగులేటి ప్రయాణిస్తున్న విమానంలోనే అనుకోకుండా రోహిత్‌ కూడా వెళ్లాడంటూ చెప్తున్నారు. ఇండిగో ఫ్లైట్‌లో టెక్నికల్‌ ఇష్యూ కారణంగా ఫ్లైట్‌ ఆగిందని చెప్తున్నారు.

ఈ రెండు వాదనల్లో ఏది నిజం ఏది అబద్ధం అన్న విషయం కాసేపు పక్కన పెడితే. రోహిత్‌ ఫ్లైట్‌లో ఉండటం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్ఎస్‌ పార్టీ ఉండదు.. ఆ పార్టీ నేతలంతా వెళ్లి వేరే పార్టీలో చేరుతారంటూ కాంగ్రెస్‌ నాయకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డితో సహా ప్రతీ ఒక్కరూ ఈ విషయన్నా చాలా సార్లు చెప్పారు. ఇప్పడు ఆ కామెంట్స్‌కు అనుగుణంగా బీఆర్ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ నేతలతో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రోహిత్‌ వర్గీలు చెప్తున్నట్టు ఇది యాదృచ్ఛికమేనా.. లేక నిజంగానే రోహిత్‌ బీఆర్ఎస్‌కు షాకిచ్చే ప్లాన్‌ ఏదైనా చేస్తున్నారా చూడాలి.