CONGRESS MP’S: తెలంగాణలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో రెండు మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. సికింద్రాబాద్‌లో దానం నాగేందర్, పెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణ.. ఈ ఇద్దర్నీ మార్చే ఛాన్సున్నట్టు తెలుస్తోంది. ఈనెల 31న AICC ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌లో మిగిలిన నలుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేయబోతోంది AICC. దాంతో పాటే ఈ రెండు మార్పులు కూడా చేస్తారని అంటున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటి వరకూ 13 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. ఇంకా 4 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
April 1: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ట్యాక్సుల నుంచి ఇన్సూరెన్స్ దాకా.. మారబోతున్నవి ఇవే..
వీటిల్లో వరంగల్ సీటు కడియం కావ్యకు ఇచ్చే అవకాశముంది. బీఆర్ఎస్ టిక్కెట్‌ను త్యాగం చేసి వచ్చిన కావ్యకు కాంగ్రెస్‌లో కన్ఫమ్ అయినట్టే అని చెబుతున్నారు. ఇక ఖమ్మం లోక్‌సభ స్థానం కోసం తీవ్రమైన పోటీ నడుస్తోంది. భట్టి విక్రమార్క.. తన భార్య నందిని కోసం, పొంగులేటి.. తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం, తుమ్మల.. తన కొడుకు యుగంధర్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీళ్ళెవరికీ కాకుండా కొత్తగా రఘురామిరెడ్డి పేరు వినిపిస్తోంది. మాజీ ఎంపీ కుమారుడైన ఆర్.సురేందర్ రెడ్డి కొడుకు రఘురామిరెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు కూడా. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరినప్పుడు.. అతని సోదరుడికి ఎంపీ టిక్కెట్ ఇస్తామని AICC పెద్దలు హామీ ఇచ్చారట. దాంతో ఆయన ఇప్పుడు టిక్కెట్ కోసం పట్టుబడుతుండటంతో.. మధ్యేమార్గంగా రఘురామిరెడ్డికి ఇస్తారని అంటున్నారు. ఇక సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ని మార్చి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కి ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
PAWAN KALYAN: జనసేన మచిలీపట్నం అభ్యర్థిగా బాలశౌరి.. మరో రెండు స్థానాలు పెండింగ్
ఖైరతాబాద్ BRS ఎమ్మెల్యేగా ఉన్న దానం.. ఆ పదవికి రాజీనామా చేశాకే ఎంపీగా పోటీ చేయాలని AICC కోరుతోంది. అందుకు ఆయన ఒప్పుకోవట్లేదు. దాంతో దానంను మార్చి బొంతుని సికింద్రాబాద్‌లో నిలబెట్టాలన్న ఆలోచన ఉంది. ఇక వరంగల్ స్థానంలో కడియం శ్రీహరి కూతురు కావ్యకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడం ఖాయమైంది. దాంతో ఇప్పుడు రాష్ట్రంలో మూడు రిజర్వుడ్ స్థానాల్లోనూ మాలలకే టిక్కెట్టు ఇచ్చినట్టు అవుతోంది. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, పెద్దపల్లికి గడ్డం వంశీ.. ఇద్దరూ మాల సామాజిక వర్గానికి చెందినవారే. వరంగల్ కూడా ఇస్తే.. మూడూ ఒకే క్యాస్ట్ వాళ్ళకి వెళ్తాయి. దాంతో మాదిగలకు అన్యాయం జరిగినట్టు అవుతోంది. అందుకే పెద్దపల్లి స్థానాన్ని వంశీకి కాకుండా మాదిగకు ఇవ్వాలని AICC భావిస్తున్నట్టు సమాచారం. పెద్దపల్లి నియోజకవర్గంలో వంశీకృష్ణ మీద వ్యతిరేకత కూడా వస్తోంది.
ఒకే కుటుంబంలో వంశీ తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్.. ఇలా ఎంతమందికి ఇస్తారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దాంతో దానంతో పాటు వంశీ కృష్ణను కూడా మార్చే ఛాన్సుంది. కరీంనగర్ రేసులో ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేర్లు వస్తున్నాయి. మరో మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకొని అతనికి టిక్కెట్ ఇస్తారని కూడా అంటున్నారు. ఈనెల 31న మిగిలిన 4 సీట్లతో పాటు మార్పులపైనా AICC నిర్ణయం తీసుకోనుంది.