Rahul Gandhi: ప్రగతి భవన్‌ను ప్రజా పాలన భవన్‌గా మారుస్తాం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ విజయం ‘ప్రజల తెలంగాణ’ అనే స్వర్ణయుగానికి నాంది పలుకుతుంది. ప్రగతి భవన్‌కు ‘ప్రజా పాలన భవన్’ అని పేరు మారుస్తాం. దీని 24 గంటలు అందరికీ తలుపులు తెరిచే ఉంటాయి. 72 గంటల్లో ప్రజల ఫిర్యాదులను వినడానికి, పరిష్కరించడానికి సీఎంతోపాటు మంత్రులందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారు.

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 08:26 PM IST

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌కు ‘ప్రజా పాలన భవన్’ అని పేరు పెడతామని వెల్లడించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎక్స్ వేదికగా శుక్రవారం తెలంగాణపై స్పందించారు రాహుల్. “కాంగ్రెస్ విజయం ‘ప్రజల తెలంగాణ’ అనే స్వర్ణయుగానికి నాంది పలుకుతుంది. ప్రగతి భవన్‌కు ‘ప్రజా పాలన భవన్’ అని పేరు మారుస్తాం. దీని 24 గంటలు అందరికీ తలుపులు తెరిచే ఉంటాయి. 72 గంటల్లో ప్రజల ఫిర్యాదులను వినడానికి, పరిష్కరించడానికి సీఎంతోపాటు మంత్రులందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారు.

KTR: తెలంగాణ ఆడబిడ్డల కోసం కొత్త పథకం సౌభాగ్య లక్ష్మి తెస్తాం: కేటీఆర్

జవాబుదారీతనం, పారదర్శకత, ప్రజల ముందు ప్రజా తెలంగాణ నిర్మాణంలో మాతో చేరండి. #మార్పుకావాలి కాంగ్రెస్ రావాలి” అని ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పినపాకతోపాటు, వరంగల్‌లో జరిగిన ప్రచార సభల్లో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పించారు.