Sri Lanka, Sita Devi Temple : శ్రీలంకలో సీతాదేవికి ఆలయం నిర్మాణం.. అయోధ్య నుంచి సరయూ జలాలతో అభిషేకం..

శ్రీరాముడి భార్య.. ధర్మపత్ని సీతమ్మ దేవి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కోసం భారత దేశంలో ఉన్న అయోధ్య నగరం నుంచి పవిత్ర నది అయిన సరయూ జలాలు శ్రీలంకకు వెళ్లలున్నాయి.

శ్రీరాముడి భార్య.. ధర్మపత్ని సీతమ్మ దేవి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కోసం భారత దేశంలో ఉన్న అయోధ్య నగరం నుంచి పవిత్ర నది అయిన సరయూ జలాలు శ్రీలంకకు వెళ్లలున్నాయి.

ఇక విషయంలోకి వెళితే..
శ్రీలంకకు (Sri Lanka) అయోధ్య (Ayodhya) నుంచి సరయూ జలాలు (Sarayu River) శ్రీలంక ప్రభుత్వం తమ దేశంలో సీతాదేవి (Sita Devi) ఆలయాన్ని నిర్మించింది. వచ్చే నెల 19న ఆలయంను ప్రారంభించనుంది. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో వినియోగించేందుకు పవిత్ర సరయూ నదీ జలాలను పంపాలని శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులు ఉత్తరప్రదేశ్​ సర్కార్ కి లేఖలో కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన యూపీ ప్రభుత్వం ఆ పవిత్ర జలాన్ని పంపించే బాధ్యతను పర్యటక శాఖకు అప్పగించింది.

ఈ నేపథ్యంలో ఆ దేశం చేసిన విజ్ఞప్తిని యూపీ ప్రభుత్వం అయోధ‌్య రామ మందిర తీర్థ ట్రాస్ట్.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యూపీ సర్కారు అయోధ్య నుంచి సరయూ జలాలను అక్కడికి పంపించనుంది. అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ ఈ విషయాన్ని తెలిపింది. ప్రత్యేక కలశంతో జలాలను పంపిస్తున్నామని, ఆ ఆలయంలో పూజలు కూడా నిర్వహిస్తామని వెల్లడించింది.

సీతమ్మ ఆలయంలో జరిగే వేడుక భారత్‌, శ్రీలంక మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. రెండు దేశాల హృదయాలను ఏకం చేయడమే ఆ వేడుక లక్ష్యంగా పెట్టుకుందని అయోధ్య తీర్థ వికాస్ పరిషత్ సీఈవో సంతోష్ కుమార్ శర్మ తెలిపారు.

కాగా త్రేతాయుగంలో రాముని భార్య అయిన సీతమ్మ తల్లిని.. లంకా రాజు.. ఆ మహా శివుని పరమ శివ భక్తుడు.. బ్రాహ్మణ కుల వంశకుడు రావణాసురుడు. పంచవటిలో ఉన్న సీతాదేవిని అపహరించి.. లంకలో సీతమ్మ తల్లి పడిన కష్టాలు అంత ఇంతా కాదు.. అలాంటి ఇప్పుడు అదే లంకలో గొప్ప ఆలయాన్ని నిర్మిస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ భారతీయులు..

SSM