కరోనా ఈ పేరు వినగానే మనకు టక్కున.. ఆస్కార్ అవార్డు విజేత ఎం ఎం కీరవాణీ పాట గుర్తుకు వస్తుంది. అదేంటంటారా.. ఇదిగో ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇండియాకు వచ్చింది మాయదారి రోగము.. అన్నట్లుగా.. పుట్టిందేమో చైనా.. దాని పంజా మాత్రం పక్క దేశాలకు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది.
2020 లో ప్రపంచాన్ని వండే మ్యాచ్ లా ఆడుతుంది. ఏదో ఒకలా తగ్గుముఖం పడుతుంది అనే భావన అందరిలో మొదలవుతుంది.. మళ్లీ భారత్ లో కోవిడ్ పంజా విసురుతుంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుంటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. చాపకింద నీరులా దక్షిణ భారత్ లో విస్తరిస్తున్న కోవిడ్. కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ మహమ్మారి మరోసారి విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ కేసులకు సంబంధించి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. కాగా తాజాగా ఆరోగ్య శాఖ ఓ ప్రకటన చేసింది. కరోనా సోకిన వారిలో ఒకరు కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.