కరోనా ఈ పేరు వింటే చాలు మనుషులు అమడ దూరం ఊరుకుతారు. యావత్ ప్రపంచానే వణికించింది ఈ కొవిడ్. 2020లో కరోనా ప్రపంచాన్ని 20/20 మ్యాచ్ ఆడింది. తాజాగా దేశంలో మళ్లీ కరోనా కొత్త వేరియంట్ కలవరం పెడుతుంది.తెలంగాణలో కూడా కరోనా కేసులు క్రమంగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆస్పత్రి వైద్యుల్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు.