Telangana BJP : కౌన్సిలర్‌ టూ సెంట్రల్‌ మినిస్టర్‌.. బండి ట్రాక్‌ రికార్డ్‌కు ఫిదా అవ్వాల్సిందే

ఎవరు అవునన్నా కాదన్నా.. తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకుంది అంటే దానికి కారణం బండి సంజయ్‌. తెలంగాణ బీజేపీలో ప్రతీ కార్యకర్త ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. తెలంగాణ అధ్యక్షుడిగా బండిని నిజమించిన తరువాత పార్టీలో కొత్త జోష్‌ వచ్చింది.

 

 

 

ఎవరు అవునన్నా కాదన్నా.. తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకుంది అంటే దానికి కారణం బండి సంజయ్‌. తెలంగాణ బీజేపీలో ప్రతీ కార్యకర్త ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. తెలంగాణ అధ్యక్షుడిగా బండిని నిజమించిన తరువాత పార్టీలో కొత్త జోష్‌ వచ్చింది. బండి సంజయ్‌ కేసీఆర్‌ను డిఫెండ్‌ చేసిన తీరు.. కాంగ్రెస్‌ను కంట్రోల్‌ చేసిన జోరు చూసి.. వేల సంఖ్యలో కార్యకర్తలు వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరారు. సంజయ్‌ పార్టీ ప్రెసిడెంట్‌ ఐన తరువాత ప్రతీ ఎన్నికలో దాదాపుగా బీజేపీ విజయం సాధిస్తూ వచ్చింది. ఇక ఈ పార్టీ పత్తా లేదు అనుకునే స్థాయి నుంచి దాదాపు ప్రతిపక్ష స్థాయికి వచ్చింది. ఎంతోమంది సీనియర్‌ నేతలు ఉన్నా.. బండికి మాత్రమే ఇది సాధ్యమైంది.

ఈ కమిట్‌మెంటే ఇప్పుడు బండిని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టింది. మూడోసారి ప్రధాని ప్రమాణస్వీకారం చేసిన మోడీ కేబినెట్‌లో బండి సంజయ్‌కి మంత్రి పదవి దక్కింది. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన బండి జీవితం ప్రతీ కార్యకర్తకు ఆదర్శం. తన భార్య మెడలో పుస్తెలు అమ్మి మరీ కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేశారు బండి సంజయ్‌. ఆ ఎన్నికల్లో విజయం సాధించి కరీంనటర్‌ టౌన్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత లోకల్‌ ఎమ్మెల్యే గంగుల కమళాకర్‌ మీద పోటీ చేసి మూడుసార్లు ఓడిపోయారు. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్‌కి ఎంపీ టికెట్‌ ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ మీద గెలిచి రాష్ట్రవ్యాప్తంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు.

ఈ గెలుపుతో కరీంనగర్‌కు మాత్రమే పరిమితమైన బండి ఫేమ్‌.. తరువాత రాష్ట్రమంతా వ్యాపించింది. సంజయ్‌ ఇచ్చే స్పీచ్‌లు.. కార్యకర్తలను మొబిలైజ్‌ చేసే తీరుకు.. బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా ఫిదా అయ్యింది. అందుకే ఎంతో మంది సీనియర్లు ఉన్నా.. బండి సంజయ్‌కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది. సంజయ్‌ కూడా తనకు ఇచ్చిన బాధ్యతను సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్‌ చేశారు. ఆ నిబద్ధతే ఇప్పుడు ఆయనను కేంద్ర మంత్రిని చేసింది. ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నో ఏళ్లు వెయిట్‌ చేస్తే కూడా దక్కని పదవి.. వెతుక్కుంటూ మరీ వచ్చి సంజయ్‌కి చేరింది. దీంతో కౌన్సిలర్‌ టూ ఎంపీ.. ఎంపీ టూ సెంట్రల్‌ మినిస్టర్‌గా కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశారు సంజయ్‌. ఏ పదవి లేకుండా రాష్ట్రంలో రెండు పార్టీలకు చెమటలు పట్టించిన బండి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎలాంటి యాక్షన్‌ చూపిస్తారో చూడాలి.