ప్రముఖ ఫోక్ సింగర్ మల్లిక్ తేజా కు హైకోర్టు లో ఊరట లభించింది. మల్లిక్ తేజ్ ఫై లైంగిక ఆరోపణలు కేసులో కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ సంస్కృతిక సారది ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్ పై మహిళా ఫోక్ సింగర్ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు చేసారు. మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారని తేజ్ ఫై ఫిర్యాదు చేసారు. మహిళా ఫిర్యాదు ఫై కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పోలీసులు.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టగా హైకోర్ట్ లో బెయిల్ పిటీషన్ వేసాడు మల్లిక్ తేజ్.
ఎలాంటి సాక్ష్యాదారాలు లేకుండా నీరాధరోపణలో చేసారని మల్లిక్ టతేజ్ తరపు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ వాదించారు. సమాజం లో పేరు ప్రతిష్టలు ఉన్న మల్లిక్ తేజ్ ఫై కావాలనే అక్రమ కేసులు పెట్టారని కోర్టుకు దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఇక మల్లిక్ సంచలన ఆరోపణలు చేసాడు. నాపై తప్పుడు కేసులు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఆమె ఫోక్ సింగర్ గా ఎదగడానికి నేనే కారణం అని స్టార్ డమ్ వచ్చిన తర్వాత నాపై అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డాడు. నన్ను చాలా బ్లాక్ మెయిల్ చేసిందని ఆవేదన వ్యక్తం చేసాడు.