నందిగం సురేష్ కు కోర్ట్ షాక్

గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. 15వ తారీకు ఒంటిగంట నుంచి 17వ తారీకు 12 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్టు న్యాయవాది తీర్పు ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - September 13, 2024 / 06:04 PM IST

గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కస్టడీకి మంగళగిరి కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. 15వ తారీకు ఒంటిగంట నుంచి 17వ తారీకు 12 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్టు న్యాయవాది తీర్పు ఇచ్చారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను గత ఐదు రోజుల క్రితం అరెస్ట్ చేసారు.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కుట్రలో ప్రేరేపితదారులు సూత్రధారులు పై అర తీయనున్నారు మంగళగిరి రూరల్ పోలీసులు. త్వరలోనే మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతోంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే లేళ్ళ అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.