రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేయాలని నిర్దేశించింది. కరోనా XBB వేరియంట్ కారణంగా.. బాధితులు ఒక్కసారిగా పెరిగినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోన కేసులు పెరుగుతున్నాయ్. జలుబు, జ్వరం లక్షణాలతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయ్. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.
గత ఏడాది అక్టోబర్ 28న అత్యధికంగా 2వేల 208 కేసులు నమోదు కాగా.. 149రోజుల తర్వాత వెయ్యి 890 కేసులు రిజిస్టర్ అయ్యాయ్. ఇక కరోనా పరిస్తితులపై కేంద్ర ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేస్తోంది. టెస్టుల సంఖ్య పెంచాలని రాష్ట్రాలను సూచించింది. కరోనాను ఎదుర్కోవడానికి సంసిద్ధతను తనిఖీ చేయడానికి వచ్చే నెలలో అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ధేశించింది. కరోనా వ్యాప్తిపై ప్రధాని ఈ మధ్యే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా ముగిసిపోలేదని.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.