CPM : తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే సీపీఎం పోటీ.. 14 అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ తమ ఎన్నికల వ్యూహాలను మార్చుకుంటున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేస్తామని కుండ బద్దలు కొట్టి చెప్పిన టీడీపీ, వైఎస్ఆర్ టీపీ లు అసలు పోటికే దూరంగా ఉంటున్నాయి. ఇక తాజాగా కమ్యూనిష్టు పార్టీ అయిన సీపీఎం ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో ఒంటరిగా దిగుతున్నట్లు ప్రకటించింది.

తెలంగాణలో ఎన్నికలు ( Telangana elections ) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ తమ ఎన్నికల వ్యూహాలను మార్చుకుంటున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేస్తామని కుండ బద్దలు కొట్టి చెప్పిన టీడీపీ, వైఎస్ఆర్ టీపీ లు అసలు పోటికే దూరంగా ఉంటున్నాయి. ఇక తాజాగా కమ్యూనిష్టు పార్టీ అయిన సీపీఎం ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో ఒంటరిగా దిగుతున్నట్లు ప్రకటించింది.

Telangana assembly elections : సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల పర్యటన షెడ్యూల్ .. 16 రోజుల్లో.. 54 సభలు

గత మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పొత్తు పెట్టుకుని సీపీఎం ( CPM ) . కేసీఆర్ నుంచి సీపీఎంకు ఎలాంటి టికెట్లు కేటాయించకపోవడంతో.. సీపీఎం తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. పాలేరు, వైరా, మధిర టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ కు సూచించింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరికతో ఖమ్మం, పాలేరు టికెట్లు వారికి కేటాయించింది కాంగ్రెస్. దీంతో ఈ ఎన్నికల్లో ఒంటరిగానే దిగేందుకు నిర్ణయం తీసుకుంది సీపీఎం. ఇలా ప్రకటించడమే కాకుండా మొత్తం 14 మందికి ( 14 candidates  ) కూడా తొలి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది.

  • సీపీఎం అభ్యర్థుల జాబితా..
  • పాలేరు – తమ్మినేని వీరభద్రం
  • వైర – భూక్యా వీరభద్రం (ST)
  • మిర్యాలగూడ – జూలకంటి రంగారెడ్డి
  • నకిరేకల్ – చినవెంకులు (SC)
  • భువనగిరి – కొండమడుగు నర్సింహ
  • పటాన్చెరు – మల్లికార్జున్
  • ముషీరాబాద్ – ఎం. దశరథ్‌
  • భద్రాచలం – కారం పుల్లయ్య
  • అశ్వారావుపేట – పి. అర్జున్ (ST)
  • మధిర – పాలడుగు భాస్కర్ (SC)
  • ఖమ్మం – శ్రీకాంత్
  • సత్తుపల్లి – మాచర్ల భారతి (SC)
  • జనగామ – కనకారెడ్డి
  • ఇబ్రహీంపట్నం – పగడాల యాదయ్య

SURESH