ఇండియన్ పేసర్ మహ్మద్ షమీ అంటే భారతీయ క్రికెట్ అభిమానులకు అదో క్రేజ్. అయితే క్రికెటర్ షమీని కొద్ది రోజుల్లో ఎంపీ షమీగా చూడబోతున్నాం. ఆయన్ని రాజకీయాల్లో తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈమధ్య షమీ కమలం పార్టీ కార్యక్రమాల్లో కూడా బాగా కనిపిస్తున్నాడు. అంతెందుకు మొన్న మ్యాచ్ ఓడిపోయాక… షమీని ప్రధాని మోడీ దగ్గరకు తీసుకొని హగ్ చేసుకోవడం వెనక కారణం కూడా ఇదే అంటున్నారు.
OLX లో వస్తువులు కొంటున్నారా.. అయితే ఇది మీకోసమే..
మహ్మద్ షమీ.. మొన్నటి ICC వరల్డ్ కప్ లో ఇరగదీశాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఫాస్టెష్ట్ గా 50 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో 7 వికెట్లు పడగొట్టి ఇండియాను ఫైనల్ కి తేవడంలో కీలకంగా వ్యవహరించాడు. అంతేకాదు ఓవరాల్ గా ఈ వరల్డ్ కప్ లో 24 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఓడిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ఇండియన్ క్రికెటర్స్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీని ఓదార్చారు. ఆ టైమ్ లో మహ్మద్ షమీని దగ్గరకు తీసుకొని హత్తుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. షమీ కూడా తర్వాత ట్విట్టర్ లో ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పారు. తమకు స్పూర్తి కలిగించి.. దైర్యం నింపారని ట్వీట్ చేశాడు.
2024 ఏప్రిల్ లో జరిగే లోక్ సభ ఎన్నికల కోసం మహ్మద్ షమీని ప్రిపర్ చేస్తోంది బీజేపీ. షమీ నేటివ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహ. వరల్డ్ కప్ క్రికెట్ లో చేసిన అద్భుత ప్రదర్శనకు గుర్తుగా ఈ గ్రామంలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఈమధ్యే ప్రకటించారు. షమీ కూడా గత కొంతకాలంగా బీజేపీ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూనీ ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి షమీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నాడు. షమీని ఆశీర్వదించిన హోంమంత్రి.. వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలని కోరినట్టు తెలిసింది. అమ్రోహ లోక్ సభ స్థానానికి ప్రస్తుతం బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన దానిష్ అలీ ఎంపీగా ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా షమీని నిలబెట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
షమీ బీజేపీ తరపున వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం యూపీ రాజకీయాల్లో అదో సెన్సేషన్ అవుతుంది. బహుశా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి షమీయే కావొచ్చు. క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్న షమీ.. ఎంపీగా గెలవడం ఈజీయే. ఈమధ్య ఉత్తరప్రదేశ్ లో జరిగిన పట్టణ స్థానిక ఎన్నికల్లోనూ 391 ముస్లిం అభ్యర్థులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. వాళ్ళల్లో 61 మంది గెలుపొందారు. ఇక షమీ రాకతో యూపీలో ముస్లిం ఓట్ బ్యాంక్ ను కొంత క్యాష్ చేసుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. అటు షమీ కూడా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారుతున్నాడు. నైనిటాల్ లో కారు యాక్సిడెంట్ లో చావుబతుకుల మధ్య ఉన్న ఓ వ్యక్తి కాపాడాడు. ఆయన హీరోయిజాన్ని ఫ్యాన్స్ తెగ మెచ్చుకుంటున్నారు. సో.. ఇవన్నీ బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక అవడానికి షమీకి ప్లస్ పాయింట్స్ అవుతాయని అనుకుంటున్నారు.