ARTICLE 370 : 370 ఆర్టికల్ రద్దు కరెక్ట్.. సుంప్రీకోర్టు సంచలన తీర్పు

జమ్ముకశ్మీర్ కు స్వయంత్రప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆర్టికల్ 370రద్దు చేయడం సరైనదే అని తీర్పు చెప్పింది. ఈ విషయంలో పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమనీ... కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయం సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు న్యాయమూర్తులు. భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూఢ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పును వెల్లడించింది.

జమ్ముకశ్మీర్ కు స్వయంత్రప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆర్టికల్ 370రద్దు చేయడం సరైనదే అని తీర్పు చెప్పింది. ఈ విషయంలో పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేమనీ… కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయం సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు న్యాయమూర్తులు. భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూఢ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పును వెల్లడించింది.

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్ముకశ్మీర్ కు చెందిన పార్టీలు, వివిధ సంస్థలు దాదాపు 23 పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశాయి. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 5గురు సభ్యుల ధర్మాసనం దీనిపై తుదితీర్పు వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది సుప్రీంకోర్టు. అందుకోసం రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు సమంజసమే అని తీర్పు చెప్పింది. దేశంలో విలీనం అయినప్పుడు కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదు. ఆ తర్వాత కూడా సార్వభౌమాధికారం ఇవ్వలేదన్నారు న్యాయమూర్తులు. అప్పట్లో జమ్ముకశ్మీర్ లో యుద్ధవాతావరణ ఉన్నందువల్ల తాత్కాలిక ఉపశమన చర్యగా మాత్రమే 370 ఆర్టికల్ ను ప్రభుత్వం తీసుకొచ్చినట్టు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అన్నారు సీజేఐ చంద్ర ఛూడ్. ఈ ఆర్టికల్ ను రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కేంద్రానికి అవసరం లేదన్నారు. 2023 ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది. సుప్రీం ధర్మాసనంలో సీజేఐ డి.వై. చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు.

సుప్రీంకోర్టులో తుది తీర్పు సందర్భంగా కశ్మీర్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా కేంద్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నాయి బలగాలు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తీర్పును రాజకీయం చేయొద్దనీ… సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ తెలిపింది.