ఐపీఎల్ కు కమ్మిన్స్ డౌటే అయోమయంలో సన్ రైజర్స్

ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేసిన బీసీసీఐ వేలాన్ని విదేశాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అటు ఫ్రాంచైజీలు కూడా తమ రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి.

  • Written By:
  • Publish Date - October 16, 2024 / 06:58 PM IST

ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలం నవంబర్ చివరి వారంలో జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్ రూల్స్ ను ఖరారు చేసిన బీసీసీఐ వేలాన్ని విదేశాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అటు ఫ్రాంచైజీలు కూడా తమ రిటెన్షన్ జాబితాను సిద్ధం చేసుకుంటున్నాయి. అక్టోబర్ 31 లోపు రిటెన్షన్ లిస్టును ప్రకటించాల్సి ఉండగా..సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్, సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వచ్చే సీజన్ ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా చేసిన కామెంట్స్ ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి. వచ్చే సీజన్ లో తాను ఆడటం అనుమానమే అంటూ కమ్మిన్స్ తనతో చెప్పిన విషయాన్ని ఆకాశ్ చోప్రా బయటపెట్టాడు.

విదేశీ ప్లేయర్లపై బీసీసీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు కమిన్స్‌ను వెనకడుగు వేసేలా చేసాయని చోప్రా అన్నాడు. అలాగే ఆసీస్ క్రికెటర్ల ప్రాధాన్యత వేరుగా ఉంటుందన్నాడు. యాషెస్‌ సిరీస్, వరల్డ్ కప్‌లపైనే కంగారూలు ఎక్కువ ఫోకస్ చేస్తారని గుర్తు చేశాడు. ఈ మధ్యలో ఐపీఎల్‌ ఆడేందుకు ప్రయత్నిస్తారని చెప్పుకొచ్చాడు. అయితే కొత్త నిబంధనలు ఈ ఆసీస్ స్టార్ బౌలర్ ను ఆలోచనలో పడేశాయన్నాడు. కాగా బీసీసీఐ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం విదేశీ క్రికెటర్లు వేలంలో పాల్గొనేందుకు మొదట రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోని విదేశీ ఆటగాళ్లు తర్వాత జరిగే మినీ వేలంలో పాల్గొనడానికి అవకాశం లేదు. అలాగే మెగా వేలంలో కొనుగోలైన తర్వాత సీజన్ ప్రారంభానికి ముందు.. అందుబాటులో ఉండట్లేదని తెలిపితే, రెండు సీజన్ల వేలంలో అతను నిషేధానికి గురవుతాడు.

ఇదిలా ఉంటే తమ రిటెన్షన్ జాబితాలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కే సన్ రైజర్స్ మొదటి ప్రాధాన్యతనిచ్చినట్టు తెలుస్తోంది. గత సీజన్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన అతనికి 18 కోట్లు ఇవ్వడానికి సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అయితే ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు కావ్యా పాపను అయోమయంలోకి నెట్టినట్టు తెలుస్తోంది. ఒకవేళ స్టార్క్ అందుబాటులో లేకుంటే మాత్రం సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బగానే చెప్పాలి. కాగా నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాలి. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం 4 కోట్లు చెల్లించాలి.