స్పిన్నర్లపై దాదాగిరీ.. గంగూలీ తరహాలో జైశ్వాల్

వరల్డ్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ గురించి ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. బౌలర్ ఎవరైనా దాదాగిరీ చేసేవాడు... ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో ఫ్రంట్ ఫూట్ కు వచ్చి దాదా కొట్టిన సిక్సర్ చూస్తే ఆ కిక్కే వేరు.. తన క్రికెట్ కెరీర్ లో గంగూలీ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 06:26 PM IST

వరల్డ్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ గురించి ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. బౌలర్ ఎవరైనా దాదాగిరీ చేసేవాడు… ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్ లో ఫ్రంట్ ఫూట్ కు వచ్చి దాదా కొట్టిన సిక్సర్ చూస్తే ఆ కిక్కే వేరు.. తన క్రికెట్ కెరీర్ లో గంగూలీ స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో దాదా దూకుడు చూసితీరాల్సిందే…మళ్ళీ చాలారోజుల తర్వాత భారత క్రికెట్ లో లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దాదాను గుర్తు చేస్తున్నాడు. రెడ్ బాల్ ఫార్మాట్ లో స్పిన్నర్లను తనదైన శైలిలో ఆడుకుంటున్నాడు. లెఫ్టార్మ్ స్పిన్ , ఆఫ్ బ్రేక్ బౌలర్లపై పూర్తి డామినేషన్ కనబరుస్తున్నాడు. తాజాగా బంగ్లాదేశ్ తో చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లోనూ ఆకట్టుకున్నాడు.

స్పిన్నర్లపై ఈ యువ ఓపెనర్ ఆధిపత్యం గంగూలీ తరహాలోనే సాగుతోంది. గత 9 ఇన్నింగ్స్ లలో ఆఫ్ బ్రేక్ బౌలర్లపై 365 పరుగులు చేయగా… లెఫ్టార్మ్ స్పిన్నర్లపై 109 యావరే్ తో 218 రన్స్ చేశాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడుతున్న జైశ్వాల్ రానున్న రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగిస్తే అత్యుత్తమ స్థాయికి చేరుకోవడం ఖాయమని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. నిజానికి టెస్టుల్లో అరంగేట్రం నుంచే జైశ్వాల్ దుమ్మురేపుతున్నాడు. దూకుడుగా ఆడుతూ మెరుపు ఇన్నింగ్స్ లతో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచేందుకు చేరవులో ఉన్నాడు.