South China: తల్లిలా లాలించేందుకు.. తండ్రిలా ఆడించేందుకు అద్దె డాడీలు వచ్చేశారు..

ఒకప్పుడు కొత్త ఒక వింత.. పాత ఒక రోత అనే సామెత ఉండేది. ఇది కాస్త కాలంతో మార్పు చెంది గతం ఎంతో వ్యధ.. కొత్త కాలం గాధ అనేలా మారిపోయింది. ఎందుకిలా అంటున్నామంటే మారుతున్న పరిస్తితులు ఇలా అద్దం పడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - July 4, 2023 / 08:00 PM IST

ఒకప్పుడు అద్దెకు సైకిళ్లు తీసుకునేవాళ్లం. కొంత పెద్దయ్యాక బైకులు.. కార్లు తీసుకుంటున్నాం. అదే మన ఇంట్లో పెద్దలైతే ఇల్లు, షాపులు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తారు. మరికొందరైతే రెంట్ కు సామాన్లు కట్ర తీసుకొని తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు. ఇది మన సమజంలో సాధారణంగా జరిగే తంతు. వీటన్నింటికీ భిన్నంగా ఇటీవలె రెంటల్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ అందుబాటులోకి వచ్చింది. దీనికి కొన్ని యాప్ లు కూడా ఉన్నాయి. వాటిలో అమ్మాయి లేదా అబ్బాయిని బుక్ చేసుకోని స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటారు. ఇది తాజాగా అద్దెకు డాడీలు దొరికేలాగా విస్తరించింది. మీకు చదివేందుకు కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మరి కొందరికి ఎబ్బెట్టుగా ఉండవచ్చు. కానీ ఇది వాస్తవికతనుదాల్చిన నిజం. ఈ కథేంటో.. ఎందుకు ఇలా అద్దె తండ్రులు సమాజంలోకి వచ్చాయో తెలుసుకుందాం.

అసలు ఈ అద్దెకు లభించే తండ్రులు ఏం చేస్తారో చూద్దాం. చిన్న పిల్లలను తండ్రిలా లాలించడానికి, తల్లిలా తినిపించడానికి, అన్నలా ఆడించడానికి, చెల్లిలా శ్రద్ద చూపడానికి ఉపయోగపడుతున్నారు. ఇలా అద్దె ఫాదర్లే ఎందుకు ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేరా అనే ఆలోచన మీలో కలుగవచ్చు. ఈ పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారు. వారి వారి వృత్తి, వ్యాపారాల రిత్యా బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే కాస్త రిలాక్స్ అయ్యేందుకు సమయం కోరుకుంటున్నారు. దీంతో వారి పిల్లలను చూసుకునేందుకు సమయం లేకుండా పోయింది. సమయంతో పాటూ వ్యక్తి అవసరం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులను నుంచి ఈ అద్దె డాడీలు పుట్టుకొచ్చారు.

సౌత్ చైనాలో ఉదయాన్నే పోస్ట్ రిపోర్టులో భాగంగా అంటే వారి వారి నిత్య కృత్యాలు తీర్చుకోవడం కోసం బాత్ హౌస్ లకు వెళ్తారు. ఈ బాత్ హౌస్ లల్లో స్నానం చేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం, మసాజ్ చేయించుకోవడం వంటివి చేయించుకుంటారు. ఈ బాత్ హౌస్ లలో పురుషులు, స్త్రీలు ఇద్దరూ వచ్చి సేదతీరుతూ ఉంటారు. ఇరువురికీ వేర్వేరు సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే వారు తమ పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలేయలేక తమ వెంట పిలుచుకొని వస్తారు. అయితే పిల్లలను పక్కన పెట్టుకొని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుందని భావిస్తారు. వారిని బయట వదిలేసి లోనికి వెళితే పిల్లలను చూసుకునే వారు ఎవరూ ఉండరు. అలా వదిలేయలేక, పిలుచుకొని పోలేక మధ్యలో సతమతమౌతూ ఉండటాన్ని బాత్ హౌజ్ నిర్వాహకులు గమనించారు.

Dad On Rent Service in South China

బాత్ హౌస్ లకు వచ్చిన తల్లిదండ్రులు పిల్లల వల్ల పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని డాడీ ఆన్ రెంట్ అనే సరికొత్త సేవలను ప్రారంభించారు. మహిళలు బాత్ హౌస్ లకు వచ్చిన సమయంలో వారి పిల్లలను ఈ అద్దె డాడీలకు అప్పగిస్తే తమ తల్లిదండ్రులు తిరిగి బయటకు వచ్చేంత వరకూ సంరక్షిస్తారు. ఇక పేరెంట్స్ ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా రిలాక్స్ అవుతారు. ఈ విధమైన డాడీ ఆన్ రెంట్ కు సంబంధించిన అంశం అక్కడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో అద్దె డాడీలు పిల్లలకు అన్నం తినిపించడం, ఎత్తుకొని ఆడించడం, స్నానం చేయించడం, బట్టలు మార్చడం, వారితో ఆడుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. పిల్లల తల్లిదండ్రులు బాత్ హౌస్ ల నుంచి బయటకు వచ్చేంత వరకూ పూర్తి బాధ్యతను తమ భుజాల మీద వేసుకుంటారు. తాజాగా ఇలా చేసేందుకు కొందరిని నియమించుకునేందుకు కూడా సిద్దం అయ్యింది ఈ సంస్థ. రెంట్ డాడీలుగా ఎలా ప్రవర్తించాలనే అంశం మీద శిక్షణను కూడా ఇస్తున్నారు. ఆసక్తికలిగిన వారు ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వినియోగించుకోవచ్చంటున్నారు.

చైనా అనగానే అన్ని వింతలకూ, ఎలక్ట్రానిక్ వస్తువులకు, కరోనా వంటి అంటు వ్యాధులకు ప్రసిద్ది. ఇలా తాను ప్రసిద్దికెక్కడమే కాకుండా తన వస్తువులను, వైరస్ లను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసింది. అలాగే ఈ అద్దె డాడీల కల్చర్ ను కూడా ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేస్తుందా లేక ఆ ఒక్క దేశానికే పరిమితం అవుతుందా అనేది వేచిచూడాలి.

T.V.SRIKAR