DANAM NAGENDER: కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్‌.. దానం నామినేషన్‌ను ఈసీ రద్దు చేస్తుందా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. నిజానికి ఇలా పార్టీ ఫిరాయిస్తే.. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యే పదవి రద్దు కావాలి.

  • Written By:
  • Updated On - April 26, 2024 / 04:47 PM IST

DANAM NAGENDER: సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్‌ నామినేషన్‌ చెల్లుతుందా లేదా. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ను టెన్షన్‌ పెడుతున్న అంశం. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్‌.. తరువాత పార్టీ మారి కాంగ్రెస్‌ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు. కానీ ఆ నామినేషన్‌ను రద్దు చేయాలని బీఆర్ఎస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

PM MODI: ప్రధాని మోడీపై అనర్హత వేటు పడుతుందా..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. నిజానికి ఇలా పార్టీ ఫిరాయిస్తే.. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యే పదవి రద్దు కావాలి. కానీ రద్దు చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది. కోర్టులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవు. ఇక్కడ స్పీకర్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తే కావడంతో ప్రస్తుతానికి దానం ఎమ్మెల్యే పదవికి పెద్దగా వచ్చిన రిస్క్‌ ఏం లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే దానం ఇప్పుడు ఎంపీగా నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఎంపీగా ఎలా నామినేషన్‌ వేస్తారు అనేది బీఆర్ఎస్‌ పార్టీ లేవనెత్తుతున్న పాయింట్‌. ఎంపీగా పోటీ చేయాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధమని.. వెంటనే దానం నామినేషన్‌ను రద్దు చేయడంతో పాటు ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

తెలంగాణలో అధికారం కోల్పోయిన తరువాత చాలా మంది బీఆర్ఎస్‌ నేతలు పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. అందులో కొందరు పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నారు. కానీ వాళ్లెవరూ ఎమ్మెల్యేలుగా ఉంటూ ఎంపీకి నామినేషన్‌ వేయలేదు. కేవలం దానం నాగేందర్‌ మాత్రమే అటు ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూనే ఎంపీగా నామినేషన్‌ వేశారు. దీంతో దానం ఎపిసోడ్‌లో తరువాత ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది. మరి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.