ఆ ముగ్గురికీ డేంజర్ బెల్స్ సిరీస్ గెలవకుంటే కెరీర్ క్లోజ్

ఏ టైమ్ లో న్యూజిలాండ్ పై మూడు టెస్టుల సిరీస్ ఓడిపోయామో కానీ భారత క్రికెట్ లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సిరీస్ ఓటమికి కారణాలు విశ్లేషించే క్రమంలో పలు వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కోచ్ గంభీర్ , రోహిత్ మధ్య తుది జట్టు ఎంపికలో ఏకాభిప్రాయం కుదర్లేదని కూడా తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 7, 2024 / 07:45 PM IST

ఏ టైమ్ లో న్యూజిలాండ్ పై మూడు టెస్టుల సిరీస్ ఓడిపోయామో కానీ భారత క్రికెట్ లో ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సిరీస్ ఓటమికి కారణాలు విశ్లేషించే క్రమంలో పలు వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కోచ్ గంభీర్ , రోహిత్ మధ్య తుది జట్టు ఎంపికలో ఏకాభిప్రాయం కుదర్లేదని కూడా తెలుస్తోంది. అలాగే బ్యాటర్ల వైఫల్యమే ఈ వైట్ వాష్ పరాభవానికి ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ ఓటమి తర్వాత ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటోంది కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే… ఎందుకంటే గత 10 నెలలుగా టెస్టుల్లో వీరిద్దరూ స్థాయికి తగినట్టు ఆడడం లేదు. తమ కెరీర్ లోనే పేలవమైన ఫామ్ లో ఉన్న కోహ్లీ, రోహిత్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం కానుంది. అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ కు కూడా ఈ సిరీస్ అగ్నిపరీక్షగానే చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియా టూర్ ఈ ముగ్గురు ఫ్యూచర్ కెరీర్ ను డిసైడ్ చేయబోతోంది.

కోచ్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది రెండో సిరీస్ ఓటమి. శ్రీలంక టూర్ లో వన్డే సిరీస్ ను కోల్పోయినప్పుడు కూడా గంభీర్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలో అది కూడా సొంతగడ్డపై వైట్ వాష్ పరాభవం గంభీర్ కు గట్టి షాకే అని చెప్పాలి. టీమిండియాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. అయితే గంభీర్ అనుసరించిన కొన్ని వ్యూహాలు ఫెయిలైనట్టు మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. అలాగే తుది జట్టు ఎంపికలో తన నిర్ణయమే ఫైనల్ గా ఉండేలా, రోహిత్ ను పట్టించుకోలేదన్న వాదనా వినిపిస్తోంది. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో కొన్ని మార్పులు కూడా గంభీర్ పై విమర్శలకు కారణమయ్యాయి. సిరాజ్ ను నైట్ వాచ్ మన్ గా పంపించడం, సర్ఫరాజ్ ఖాన్ ను లోయర్ ఆర్డర్ లో దింపడం వంటివి జట్టుకు నష్టాన్నే చేశాయన్నది మాజీల అభిప్రాయం. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ స్థాయికి తగినట్టు ఆడకుంటే మాత్రం గంభీర్ పై బీసీసీఐ రివ్యూ చేస్తుందని సమాచారం. టెస్ట్ ఫార్మాట్ కు మరొక కోచ్ ను నియమించే ప్రతిపాదన కూడా వచ్చిన నేపథ్యంలో గంభీర్ కు ఆసీస్ టూర్ అగ్నిపరీక్షే.

ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఈ సిరీస్ లో రాణించాల్సిందే.. స్వదేశంలో కివీస్ తో సిరీస్ విఫలమైన వీరిద్దరూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ ప్రకటించే టైమ్ వచ్చిందంటూ అభిప్రాయాలు కూడా వినిపించాయి. దీంతో ఆస్ట్రేలియా టూర్ లో ఫామ్ లోకి రాకుంటే మాత్రం ఇద్దరి టెస్ట్ కెరీర్ ముగిసినట్టేనని భావిస్తున్నారు. బీసీసీఐ తప్పించకముందే రోహిత్, కోహ్లీ ఇద్దరు టెస్టులకు వీడ్కోలు పలుకుతారంటూ కొందరు మాజీ ఆటగాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టీ ట్వంటీలకు గుడ్ బై చెప్పిన రోహిత్ , కోహ్లీ ఆసీస్ టూర్ తర్వాత ఇక వన్డేల్లో మాత్రమే కనిపిస్తారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.