Medigadda Barriage : మేడిగడ్డ.. దేశంలోనే భారీ స్కామ్ విజిలెన్స్ రిపోర్టులో సంచలనాలు !

తెలంగాణలో కాళేశ్వర్యం భారీ ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణం దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా నిలవబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 3 వేల 200కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ నిర్మాణం పేరుతో వృధా చేశారని విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఈ బ్యారేజీపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు మధ్యంతర నివేదికను రెడీ చేశారు. వారంలో రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించబోతున్నారు. 

  • Written By:
  • Updated On - January 24, 2024 / 11:11 AM IST

తెలంగాణలో కాళేశ్వర్యం భారీ ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణం దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా నిలవబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 3 వేల 200కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ నిర్మాణం పేరుతో వృధా చేశారని విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఈ బ్యారేజీపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు మధ్యంతర నివేదికను రెడీ చేశారు. వారంలో రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించబోతున్నారు.

మేడిగడ్డలో మొత్తం 11 పియర్స్‌ దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న పియర్స్‌ కు రిపేర్లు  చేసినంత మాత్రాన మొత్తం బ్యారేజ్‌ నిలబడుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదనీ… ప్రాజెక్ట్ కి ఎలాంటి ఢోకాలేదని చెప్పలేమని అంటున్నారు.  అసలు మేడిగడ్డ లొకేషన్‌, డిజైన్‌ దగ్గర నుంచి మొదలుకుని నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకూ అంతా గందరగోళంగా నడిచిందని అధికారులు తెలిపారు. 20వ పియర్స్‌ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ఎఫెక్ట్‌ 11 పియర్స్‌ దాకా వ్యాపించింది. దాంతో మొత్తం 11 పియర్స్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. మరి మిగతా పియర్స్‌ బలంగా ఉన్నాయా? బలహీనంగా ఉన్నాయా అనేది ఇంకా తేల్చాల్సి ఉంది.

విజిలెన్స్ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం మేడిగ్డ బ్యారేజ్‌ అంతా ప్రమాదంలో ఉందని తెలుస్తోంది.  బ్యారేజీ కింది భాగంలో 10 టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్‌ దాదాపు వంద మీటర్లు దాటి కొట్టుకుపోయయి. సీసీ బ్లాక్స్ కొట్టుకుపోవడం వల్లే పియర్స్ కింద ఇసుకలో కదలిక వచ్చింది. దీంతో రాఫ్ట్‌ దిగువన ఖాళీ ఏర్పడినట్టు తెలుస్తోంది.  గడ్డర్ల దగ్గర పగుళ్లు ఏర్పడటం… బ్యారేజీకి ఉపయోగించిన స్టీల్ చూస్తే… ప్రాజెక్టు నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులు తేల్చారు.

అసలు బ్యారేజీ కుంగడం అనేది అకస్మాత్తుగా జరిగింది కాదనీ… రెండు మూడేళ్ల క్రితం నుంచే ఈ సమస్య మొదలైనట్టు విజిలెన్స్ రిపోర్టు చెబుతోంది. మేడిగడ్డ బ్యారేజీని వరద ప్రవాహానికి తగ్గట్లుగా డిజైన్‌  చేయలేదు. వరద నీటిపై సరైన అంచనాలు వేయకుండానే BRS ప్రభుత్వం హడావిడిగా నిర్మించినట్టు అర్థమవుతోంది. అలాగే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నుంచి నివేదిక కూడా తెప్పించుకోకుండా మేడిగడ్డ నిర్మాణం ప్రారంభించారని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక అందినట్టు సమాచారం.  కోట్ల రూపాయల ప్రజాధనంతో మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మించి… కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు జనంతో ఆటలు ఆడుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  బ్యారేజీ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులేననీ… వృధా అయిన ప్రజాధనం కూడా వాళ్ళ నుంచి వసూలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.