Darshan’s wife : పోలీసులపై దర్శన్ భార్య ఫైర్.. సంచలన లేఖ విడుదల..

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌... అతడి స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌… అతడి స్నేహితురాలు పవిత్రా గౌడ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరినీ దంపతులుగా చెప్పడంపై.. దర్శన్‌ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆమె భార్య కాదంటూ బెంగళూరు పోలీసు కమిషనర్‌ దయానందకు తాజాగా లేఖ రాశారు. పవిత్ర, దర్శన్‌ భార్యాభర్తలు అంటూ అంటూ తప్పుగా ప్రకటన చేశారని.. ఆ తర్వాత హోంమంత్రి కూడా ఇదే మాట అన్నారని.. అసలు ఆమె దర్శన్‌ భార్యనే కాదని విజయ లేఖలో వివరించారు.

ఆమె కేవలం దర్శన్‌కు స్నేహితురాలు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని తాను ఒక్కదాన్నేనని చెప్పారు. పోలీసు రికార్డుల్లోనూ పవిత్రను దర్శన్ భార్య అంటూ రాయడం.. భవిష్యత్తులో తనకు, తన కుమారుడికి సమస్యలు తీసుకువస్తుందంటూ లేఖలో రాసుకొచ్చారు. పవిత్రకు సంజయ్‌సింగ్‌ అనే వ్యక్తితో పెళ్లి అయిందని.. వారికి ఓ కూతురు కూడా ఉందని విజయ బయటపెట్టారు. ఈ వాస్తవాలను రికార్డుల్లో క్లియర్‌గా చెప్పాలి అంటూ లేఖలో విన్నవించకున్నారు. ఇక అటు విజయలక్ష్మితో పెళ్లి అయినా.. కొంతకాలంగా పవిత్రతో దర్శన్‌ క్లోజ్‌గా ఉంటున్నాడు. తమ బంధానికి పదేళ్లు అంటూ ఈ మధ్యే పవిత్ర ఓ వీడియో పోస్ట్‌ చేసింది.

దీంతో వీరి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ సంబంధంతో విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని బాధపడిన దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి.. పవిత్రకు అశ్లీల మెసేజ్‌లు, అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మెసేజ్‌ల గురించి దర్శన్‌కు చెప్పడంతో అతడు ఆగ్రహానికి గురై, రేణుకాస్వామిపై దాడి చేశాడని పవిత్ర విచారణలో అంగీరించాడు. ఈ కేసులో వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా కస్టడీలో ఉన్నారు.