DD News: మారిన దూరదర్శన్ లోగో.. ఇక కాషాయమయమేనా..?

ఇప్పుడు దూరదర్శన్ ఛానె‌ల్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆ ఛానెల్ లోగో మారడమే. తెలుపు, బ్లూ కలర్స్‌లో ఉండే.. దూరదర్శన్ లోగో ఇప్పుడు కాషాయ రంగుకు మారింది. లోగోతోపాటు లోగో కింద ఉంటే న్యూస్‌ అనే టెక్స్ట్‌ కూడా మారింది.

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 04:04 PM IST

DD News: దూరదర్శన్.. 1980, 90లలో ఇంటిల్లిపాదికీ వినోదాన్ని అందించిన టీవీ ఛానెల్. చిత్రలహరి, రామాయణం, మహాభారతం వంటి షోలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రైవేటు టీవీ ఛానెళ్ల రాకతో క్రమంగా ఆదరణ కోల్పోయింది. అయినప్పటికీ ఎక్కడా ప్రసారాలు మాత్రం ఆగిపోలేదు. అయితే, ఇప్పుడు దూరదర్శన్ ఛానె‌ల్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆ ఛానెల్ లోగో మారడమే.

Chilukuru Balaji : గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా

తెలుపు, బ్లూ కలర్స్‌లో ఉండే.. దూరదర్శన్ లోగో ఇప్పుడు కాషాయ రంగుకు మారింది. లోగోతోపాటు లోగో కింద ఉంటే న్యూస్‌ అనే టెక్స్ట్‌ కూడా మారింది. డీడీకి బదులుగా హిందీలో న్యూస్ అనే అక్షరాలు లోగో కింద చేరాయి. అత్యాధునిక స్టూడియో సిస్టమ్, అప్‌డేటెడ్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది. కొత్త తరహాలో న్యూస్ అందిస్తామని తెలిపింది. వేగంకన్నా.. కచ్చితత్వానికి, వాస్తవాలకు పెద్దపీట వేస్తామని తెలిపింది. సంచలనాలకన్నా.. సత్యానికే ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. అందరికీ భరోసా అంటూ అనౌన్స్ చేసింది. కొత్త విధానంలో డీడీ ఛానెల్ ముందుకు రాబోతుండటంపై జనాల్లో మంచి స్పందన వస్తున్నా.. మరో అంశంలో మాత్రం విమర్శలు తలెత్తుతున్నాయి.

డీడీ లోగోను కాషాయ రంగులోకి మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అది కూడా ఎన్నికల సమయంలో ఇలా కాషాయ రంగులోకి మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై స్వామి భక్తిని ప్రదర్శించిన డీడీ నిర్వాహకులు.. న్యూస్‌ ఛానల్‌ లోగో రంగును కాషాయ రంగులోకి మార్చేసి తన విధేయతను ప్రదర్శించుకుందని నెటిజన్లు అంటున్నారు. ‘ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అంటూ దూరదర్శన్‌ మాజీ సీఈవో టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ విమర్శించారు.