Captain Vijay Kanth RIP : తమిళ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కెప్టెన్ విజయ్ కాంత్ ఇక లేరు..

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. కెప్టెన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ కన్నమూశారు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంగతో బాధపడుతున్నారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నూమూశారు.

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం జరిగింది. కెప్టెన్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ కన్నమూశారు. గత కొద్ది కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంగతో బాధపడుతున్నారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నూమూశారు.

‘ఇనిక్కుం ఇలామై’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్‌కాంత్‌..కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్‌కాంత్‌.. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్‌ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు.

100వ చిత్రం ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి అభిమానులు ఆయన్ని కెప్టెన్‌గా పిలుచుకోవడం మొదలు పెట్టారు. ఇక, విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్‌ కావడం వల్ల ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు గొంతు నొప్పి కారణంగా విజయ్ కాంత్ వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు వెంటిలేటర్ పై శ్వాస అందించారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి మరింత క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని.. వైద్యులు పూర్తి ఆక్సిజన్ తో ఇంటెన్సివ్ ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలోనే నవంబర్ 23న విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగైందని..వైద్యానికి సహకరిస్తున్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత ఈనెల 11 న డిశ్చార్జీ చేశారు. డీఎండీకే వర్కింగ్ కమిటీ సాధారన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి చికిత్స కోసం విజయ్ కాంత్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. తాజాగా ఆయనకు కోవిడ్ సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతలోనే విజయ్‌కాంత్ మృతి చెందారన్న వార్తతో సినీ పరిశ్రమతో పాటు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.