మహీ భాయ్ కు రుణపడి ఉంటా, దీపక్ చాహర్ ఎమోషనల్

యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. అది జాతీయ జట్టుకు ఆడేటప్పుడైనా, ఐపీఎల్ కు ఆడినప్పుడైనా యువ బౌలర్లను ఎంతగానో మోటివేట్ చేస్తాడు. వికెట్ల వెనుక ఉన్నా ఎప్పటికప్పుడు వారికి సలహాలు ఇస్తూ అద్భుతమైన ఫలితాలు రాబడుతుంటాడు

  • Written By:
  • Publish Date - December 2, 2024 / 02:20 PM IST

యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. అది జాతీయ జట్టుకు ఆడేటప్పుడైనా, ఐపీఎల్ కు ఆడినప్పుడైనా యువ బౌలర్లను ఎంతగానో మోటివేట్ చేస్తాడు. వికెట్ల వెనుక ఉన్నా ఎప్పటికప్పుడు వారికి సలహాలు ఇస్తూ అద్భుతమైన ఫలితాలు రాబడుతుంటాడు. ధోనీ మెంటార్ షిప్ లో అద్భుతమైన ఆటగాళ్ళుగా ఎదిగిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన దీపక్ చాహర్ కూడా ధోనీ శిష్యుడే…. చెన్నై విజయాల్లో దీపక్ చాహార్ కీలక పాత్ర పోషించాడు. పలు సీజన్లలో అద్భుతమైన స్పెల్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే గాయాలు, ఫిట్ నెస్ సమస్యలతో గత సీజన్లలో నిరాశపరిచాడు. వేలంలో దీపక్ చాహర్ కోసం చెన్నై కూడా ప్రయత్నించినా కుదర్లేదు. కానీ అతనికి ఉన్న రికార్డు దృష్ట్యా ముంబై ఇండియన్స్ వేలంలో దీపక్ చాహర్ ను భారీ బిడ్ వేసి దక్కించుకుంది.

అతన్ని ముంబై ఇండియన్స్ ఏకంగా 9.25 కోట్ల రూపాయలకు అతన్ని సొంతం చేసుకుంది. 2 కోట్ల రూపాయలతో వేలంలోకి వచ్చిన చాహర్ కోసం ముందు నుంచి ముంబై వేలంలో దూకుడును ప్రదర్శించింది. పంజాబ్, చెన్నై జట్లతో పోటీపడి దీపక్ ను కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే చెన్నైకే ఆడాలని కోరుకున్న దీపక్ చాహర్ వేలం తర్వాత తొలిసారి స్పందించాడు. చెన్నైకి వీడ్కోలు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. తన కెరీర్ ఈ స్థాయిలో ఉండడానికి మహీ భాయ్ కారణమని చెప్పాడు. మహీ భాయ్ కు రుణపడి ఉంటానంటూ చెప్పుకొచ్చాడు. ఒత్తిడికి లోనైన ప్రతీసారీ ధోనీ చెప్పిన మాటలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నాడు. ఐపీఎల్ కెరీర్ లో చెన్నైతో అనుబంధం తనకు ఎంతో ప్రత్యేకమైందన్నాడు.

రాజ‌స్థాన్‌కు చెందిన 32 ఏళ్ల దీప‌క్ చాహ‌ర్ దేశ‌వాళీ క్రికెట్‌లో రాణించి.. వెలుగులోకి వచ్చాడు. దీంతో 10 లక్షల కనీస ధరకు 2016లో రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్స్ సొంతం చేసుకుంది. అప్పుడు ఆ జట్టులో ధోనీ కూడా ఆడాడు. అతడి ప్రతిభను గుర్తించి 2018లో సీఎస్కే కొనుగోలు చేసేలా చేశాడు ధోనీ. 80 లక్షలకు వేలంలో సీఎస్కే అతడిని కైవసం చేసుకుంది. ఇక 2022 వేలంలో సీఎస్కే దీపక్‌ చాహ‌ర్ కోసం ఏకంగా 14 కోట్లు వెచ్చించింది. 2018 నుంచి 2024 సీజన్ వరకూ చెన్నై సూపర్‌ కింగ్స్ తరఫున ఆడాడు. ఇప్పటివరకు అతడు 81 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడగా.. అందులో 77 వికెట్లు తీశాడు. వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.