Delhi CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor scam)లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేజ్రీవాల్ ఆరోగ్యంపై తిహార్ జైలు అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారనీ.. ఆయన్ని జైల్లోనే చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు ఆప్ నేతలు. రక్తంలో షుగర్ లెవ్స్ పెరుగుతున్నాయనీ.. తనకు ప్రతి రోజూ ఇన్సులిన్ (Insulin) ఎక్కించాలని కోరుతున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
YS JAGAN: జగన్ చేతిలో ఉంది రూ.7 వేలే.. ఆస్తి మాత్రం రూ.700 కోట్లు
తన ఆరోగ్యంపై తిహార్ జైలు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని ఈనెల 20న ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. అంత సీరియస్ కండీషన్ ఏమీ లేదని చెప్పినట్టు తిహార్ జైలు (Tihar Jail) అధికారులు స్టేట్‌మెంట్ విడుదల చేశారు. కానీ కేజ్రీవాల్ మాత్రం గ్లూకోజ్ మీటర్‌లో షుగర్ లెవల్స్ 250 నుంచి 350 దాకా చూపిస్తున్నాయనీ.. ఇది డేంజర్ లెవల్ అంటున్నారు. రాజకీయ ఒత్తిడితోనే తనకు సరైన చికిత్స అందకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నట్టు కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ డాక్టర్లకు వివరించినట్టు చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఇచ్చిన రిపోర్టులో కూడా కేజ్రీవాల్‌కు డాక్టర్లు ఓరల్ మందులే కానీ ఇన్సులిన్ అడ్వైజ్ చేయలేదని అంటున్నారు జైలు అధికారులు.
డయాబెటీస్ లెవల్స్ పెరగడానికి కేజ్రీవాల్ జైల్లో మామిడి పండ్లు, ఆలూ, పూరి, స్వీట్స్ తింటున్నారనీ.. షుగర్ టీలు తాగుతున్నట్టు ఈమధ్యే ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. అయితే కేజ్రీవాల్‌ను జైల్లో చంపడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు ఇన్సులిన్ అందించాలంటూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు.