CM Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు కేన్సర్‌!

ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ మధ్యే జైలు నుంచి బెయిల్ (Bail) మీద వచ్చారు. ఢిల్లీలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

 

 

ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈ మధ్యే జైలు నుంచి బెయిల్ (Bail) మీద వచ్చారు. ఢిల్లీలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌కు కేన్సర్‌ (Cancer) లక్షణాలు కనిపిస్తున్నాయంటూ బాంబ్ పేల్చారు. బరువు తగ్గడంతో పాటు ఆయనకు కీటోన్ స్థాయులు పెరిగాయని.. ఇది ఆందోళనకు గురిచేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత అతిశీ బాంబ్ (Atishi Bond) పేల్చారు. కేజ్రీవాల్‌లో కనిపిస్తోన్న లక్షణాలు.. తీవ్ర కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌ను సూచిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కేజ్రీవాల్‌ మద్యం పాలసీ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తన బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇలాంటి సమంయలో అతిశీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయ్. కేజ్రీవాల్ సడెన్‌గా బరువు తగ్గడమనేది ఆందోళన కలిగించే విషయం అని.. కస్టడీ నుంచి బయటకు వచ్చాక డాక్టర్ల పరిశీలనలో ఉన్నా.. కేజ్రీవాల్ బరువు పెరగడం లేదని అన్నారు. మెడికల్‌ టెస్టుల్లో ఆయన కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉందని తేలిందని.. అధిక కీటోన్ స్థాయులు, ఆకస్మికంగా బరువు తగ్గడమనేది క్యాన్సర్‌తో పాటు కిడ్నీ సంబంధ వ్యాధులకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు.

కేజ్రీవాల్ పెట్ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు సూచించినట్లు చెప్పారు. అతిశీ వ్యాఖ్యలతో ఇప్పుడు ఆప్‌ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కేజ్రీవాల్‌కు పలు సూచనలు చేస్తున్నారు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు. త్వరగా పరీక్షలు చేయించుకోవాలని.. బరువు పెరగకపోవడానికి కారణాలు తెలుసుకోవాలని అంటున్నారు.