ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్ (interim bail) మంజూరు చేసింది. ఆయనకు దేశ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది. మరోవైపు సీబీఐ కేసులో సీఎంకు ఇంకా బెయిల్ రాలేదు. దీంతో ఆయన కస్టడీలోనే ఉండనున్నారు.