MLC KAVITHA: తిహార్ జైలులో కవిత కోసం స్పెషల్‌ ఏర్పాట్లు..

కోర్టు ఆదేశాల తర్వాత.. అధికారులు వ్యానులో కవితను తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకు ఆమె ఆ జైల్లోనే ఉండనున్నారు. ఐతే జైలులో కవితకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని.. జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది.

  • Written By:
  • Updated On - March 26, 2024 / 08:58 PM IST

MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకూ ఆమెకు రిమాండ్ విధించగా.. అధికారులు కవితను తిహార్ జైలుకు తరలించారు. కవితను మళ్లీ తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా.. అందుకు నిరాకరించిన న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి ఇచ్చామని.. మరోసారి ఇవ్వలేమని తెలుపుతూ రిమాండ్‌కు పంపించింది. కవితను కోర్టులో హాజరుపరిచిన సమయంలో.. కవిత ఎమోషనల్ అయ్యారు.

KTR on Media: 16 మీడియా సంస్థలపై KTR ఫ్యామిలీ కేసులు !

తనపై తప్పుడు కేసు పెట్టారని.. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఆరోపణలు గుప్పించారు. ఇదంతా ఎలా ఉన్నా.. కోర్టు ఆదేశాల తర్వాత.. అధికారులు వ్యానులో కవితను తిహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకు ఆమె ఆ జైల్లోనే ఉండనున్నారు. ఐతే జైలులో కవితకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని.. జైలు సూపరింటెండెంట్‌ను కోర్టు ఆదేశించింది. కవిత ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. సూపరిండెంట్‌కు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఇంటి భోజనాన్ని అనుమతించడంతో పాటు.. నిద్రపోవడానికి పరుపులు, చెప్పులు, బట్టలు, బెడ్ షీట్స్, బ్లాంకెట్‌కు అనుమతి ఇచ్చారు. అలాగే కొన్ని పేపర్లు, పెన్నులను ఏర్పాటు చేయాలని చెప్పింది. టాబ్లెట్లకు అనుమతి ఇవ్వడంతో పాటు.. బంగారం ధరించేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది.

మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న రెగ్యులర్ వాదనలు జరగనున్నాయ్. దీనిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. తన పిల్లలకు పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టును కోరారు. ఐతే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ అధికారులు కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నామని న్యాయస్థానానికి వివరించారు. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.