Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్ళీ రిలీఫ్.. సీఎంగా కొనసాడంపై రాష్ట్రపతి, గవర్నర్‌దే నిర్ణయం: ఢిల్లీ హైకోర్టు

లిక్కర్ తో పాటు మనీలాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కి సీఎం గా కొనసాగే అర్హత లేదని పిటిషన్ వాదించారు. అది తమకు సంబంధం లేని అంశమనీ.. ఈ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 01:09 PM IST

Arvind Kejriwal: లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న కేజ్రీవాల్ ను ఢిల్లీ సీఎంగా కొనసాగకుండా చూడాలన్న పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లిక్కర్ తో పాటు మనీలాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కి సీఎం గా కొనసాగే అర్హత లేదని పిటిషన్ వాదించారు. అది తమకు సంబంధం లేని అంశమనీ.. ఈ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.

PAWAN KALYAN: థియేటర్ల దగ్గర ఉన్న ఉద్యోగులు పింఛన్లు ఇవ్వడానికి లేరా.. ప్రభుత్వానికి పవన్ ప్రశ్న

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడానికి వీల్లేదని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. గతంలో వేసిన ఇలాంటి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సీఎంగా రాజీనామా చేయాలా వద్దా అన్నది కేజ్రీవాల్ అతని వ్యక్తిగత అభిప్రాయమనీ.. దాన్ని నేషనల్ ఇంట్రెస్ట్ గా చూడొద్దని న్యాయస్థానం అభిప్రాయపడింది. హిందూ సేనకు చెందిన విష్ణు గుప్తా ఫైల్ చేసిన పిటిషన్ ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా బెంచి కొట్టివేసింది. ప్రాక్టికల్ ఇష్యూని లీగల్ ఇష్యూగా చూడొద్దనీ, గవర్నర్ కి అన్ని అధికారాలు ఉన్నాయనీ.. ఈ విషయంలో కోర్టులు గైడెన్స్ ఇవ్వనవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.

ప్రతి అంశం కోర్టులోనే తేలుతుందని అనుకోవద్దని అన్నారు న్యాయమూర్తులు. కేజ్రీవాల్ పై వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని విష్ణుగుప్తా లాయర్ కు ధర్మాసనం సూచించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపింది. విష్ణుగుప్తా తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవడంతో… కోర్టు ఈ కేసును డిస్పోజ్ చేసింది.