PM MODI: ప్రధాని నరేంద్రమోడీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని హైకోర్టు విచారణకు కూడా స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ (శుక్రవారం) వాదనలు జరగాల్సి ఉంది. కానీ ఈనెల 29 (సోమవారం)కి వాయిదా పడింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ దేవుళ్ళు, మతాల పేర్లను వాడుకుంటూ ఆరోపణలు చేస్తున్నారని కోర్టులో పిటిషన్ ఫైల్ అయింది.
HARISH RAO VS REVANTH: రాజీనామా హైడ్రామా.. రేవంత్ వర్సెస్ హరీష్..
హనుమాన్ చాలీసాను స్వేచ్ఛగా వినే హక్కును కూడా జనం కోల్పోయారని పీఎం మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అంతకుముందు ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ప్రచారంలో.. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను దోచి, ముస్లిమ్స్‌కి పంచిపెడుతుందని విమర్శించారు. రామ మందిరం నిర్మాణం గురించి మాట్లాడటంతో పాటు సిక్కులకు కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ తిరిగి తెరుస్తామని హామీ ఇచ్చారు మోడీ. ఆయన హిందూ, సిక్కు మతాల వారి ఓట్ల కోసం ప్రచారం చేశారనేది పిటిషనర్, న్యాయవాది జోంఢలే ఆరోపణ. అలాగే మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వ హెలికాప్టర్లు, విమానాల్లో తిరుగతూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ తెలిపారు.
మతం పేరు చెప్పి ప్రచారం చేస్తున్న పీఎం మోడీని ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా సస్పెండ్ చేయాలని. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మళ్ళీ మతం పేరుతో ఓట్లు అడక్కుండా మోడీని ఆదేశించాలన్నారు. తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు న్యాయవాది జోండలే. ఈ పిటిషన్ ఈనెల 29న ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.