Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కవితను నిందితురాలిగా పరిగణిస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. గతంలో సమాచారం కోసం కవితను సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది.
Lasya Nanditha: లాస్య నందిత డ్రైవర్ ఎక్కడ.. ఆకాశ్ ఏం చెప్పి ఆమెను తీసుకెళ్లాడు..
ఈ కేసులో విచారణ ఎదుర్కొంటూ, అరెస్టైన కీలక నిందితులు అప్రూవర్‌లుగా మారారు. నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డిని గతంలోనే సీబీఐ అరెస్టు చేసింది. వీళ్లు ప్రస్తుతం అప్రూవర్లుగా మారినట్లు సీబీఐ చెబుతోంది. అలాగే కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కూడా కవితకు నోటీసులు ఇచ్చారు. దీంతో కవితను ఈ నెల 26న సీబీఐ ప్రశ్నించనుంది.
అయితే, ఆమెను ప్రశ్నించిన అదే రోజు సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆయనను కూడా సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉందని ఆప్ వర్గాలు అంటున్నాయి.