Delhi Liquor Scam : కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు పూర్తి..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తిహార్ జైల్లో ఉంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ ఆషీసర్లు అదే రోజున రాత్రి కవితను అరెస్టు చేసి.. ఆమెను స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. కవితకు బెయిల్ కోసం ఆమె తరఫు లాయర్లు అనేక ప్రయత్నాలు చేసినా.. ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తోంది. పలుమార్లు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

100 రోజులైన కవితను చూడని కన్న తండ్రి…

కవిత అరెస్ట్ ఇన్ని రోజులు అవుతున్న తెలంగాణ మాజీ సీఎం, కవిత కన్న తండ్రి ఇప్పటి వరకు తీహార్ జైలుకు వెళ్లి కలవలేదు. కవిత తల్లి శోభ ఒకసారి వెళ్లి కవితను కలిసి వచ్చారు. కాగా తారచు మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావు వెళ్లి ములఖత్ అయ్యి వస్తున్నారు. వీళ్లతో పాటుగా పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్ ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు కవితతో కలిసి మాట్లాడుతున్నారు.