Cyber Safety: ఫేక్ మెసేజెస్‌ వస్తున్నాయా.. ఇలా గుర్తించండి..

మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చినట్లుగా కొందరు ఫేక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని గుర్తించడం సాధారణంగా కష్టం. కానీ, కొంచెం అవగాహన కలిగి ఉంటే.. అలాంటి ఫేక్ లింక్స్‌ను ఈజీగా గుర్తించవచ్చు. దీనిపై అవగాహన కలిగేలా ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 06:46 PM IST

Cyber Safety: ఇటీవలి కాలంలో ఫేక్ మెసేజెస్, మాల్‌వేర్ ఉన్న లింక్స్ విపరీతంగా పెరిగిపోయాయి. చాలామంది అలాంటి లింక్స్‌పై క్లిక్ చేసి వేలు, లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇటీవల కొంత పెరిగిన అవగాహనతో కొన్ని లింక్స్ ఓపెన్ చేయకూడదనే సంగతి చాలా మందికి తెలుసు. అయితే, ఇంకొన్ని లింక్స్ మాత్రం నిజమనిపించేలా ఉంటాయి. అలాంటి వాటి విషయంలో ఇంకా అప్రమత్తత అవసరం. ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చినట్లుగా కొందరు ఫేక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నారు.

DEVARA: దేవర మీద మూకుమ్మడి దాడి.. పోటీ తట్టుకోగలడా..?

వాటిని గుర్తించడం సాధారణంగా కష్టం. కానీ, కొంచెం అవగాహన కలిగి ఉంటే.. అలాంటి ఫేక్ లింక్స్‌ను ఈజీగా గుర్తించవచ్చు. దీనిపై అవగాహన కలిగేలా ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్‌లో ఒకే దానికి సంబంధించి వచ్చిన రెండు వేర్వేరు మెసేజెస్‌ను ట్వీట్ చేశారు. ఆ రెండు ఒకే బ్యాంకు నుంచి వచ్చినట్లుగా ఉన్నాయి. ఒకేలా ఉన్నాయి. కానీ, జాగ్రత్తగా గమనిస్తే రెండింటిలో ఒక తేడా కనిపిస్తుంది. కంపెనీ నుంచి ఒరిజినల్‌గా వచ్చే మెసేజ్‌లు రెగ్యులర్ లెటర్స్, స్క్రిప్ట్ కలిగి ఉంటాయి. అదే.. సైబర్ నేరగాళ్లు పంపే ఫేక్ లింక్స్ మాత్రం సరిల్లిక్ స్క్రిప్ట్స్ కలిగి ఉంటాయి. మీకు వచ్చిన లింక్స్ మెసేజెస్‌లో ఏదైనా లెటర్ కాస్త తేడాగా, సరిల్లిక్‌గా అనిపిస్తే అది ఫేక్ అని అర్థం. అలాంటివాటిపై క్లిక్ చేయకూడదు. పొరపాటున ఫేక్‌ లింక్‌ను క్లిక్‌ చేస్తే, వెంటనే మీ ఫోన్‌లో టూ ఫాక్టర్‌ అథెంటికేషన్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది.

అలాగే బ్యాంక్‌ ఖాతా, పాస్‌వర్డ్‌ వంటి వాటిని హ్యాక్‌ చేసే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తెలియని నెంబర్లు, ఐడీల నుంచి వచ్చే లింక్స్‌పై క్లిక్ చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించిన మెసేజెస్ వస్తే వెంటనే మొబైల్‌లోనే, గూగుల్‌లో బ్యాంక్ అధికారిక సైట్ విజిట్ చేసి చెక్ చేసుకోవాలి. మరింత అవగాహన కోసం ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ చూడండి.