Delhi Liquor Scam Kavitha : కవిత బెయిల్ పిటిషన్‌పై ఎల్లుండి తీర్పు…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఈడీ తరపున న్యాయవాది.. కవిత తరపు న్యాయవాదులు కోర్టులో దాదాపు రెండు గంటల పాటు ఇరువైపుల వాదనలు వినిపించారు. దీంతో ఢిల్లీ కోర్టు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS MLC కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జులై 1న మ.2.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న CBI వాదనలు.. బెయిల్ ఇవ్వాలన్న కవిత లాయర్ల వాదనలను విని న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. దీంతో కవితకు ఊరట దక్కుతుందా? నిరాశ ఎదురవుతుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా మార్చి 15న ఈడీ ఆమెను అరెస్ట్ చేసింది.

ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి 100 రోజులు పూర్తి అయ్యింది. కాగా తెలంగాణ తొలి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత, కవిత తండ్రి కేసీఆర్ ఒక్కసారి కూడా కలవడానికి తిహార్ జైళుకు వెళ్లలేదు. హరీష్‌రావు, కవిత భర్త అనిల్‌ కుటుంబ సభ్యులందరూ ఆమెను కలిశారు. కేసీఆర్ మాత్రం అక్కడికి వెళ్లలేదు.. కవిత కలవలేదు.. మరో వైపు జూలై 1 నుంచి మళ్లీ ఈడీ రిమాండ్ కస్టడి పోడిగిస్తే.. మరి కొన్ని రోజులు కవిత తీహార్ జైల్లోనే ఉండాల్సి ఉండవలసి ఉంటుంది. కాగా వేచి చూడాలి జూలై 1న ఎలాంటి తీర్పు రాబోతుందో…